iDreamPost

Acharya అంతులేని ఆచార్య గాయాలు

Acharya అంతులేని ఆచార్య గాయాలు

151 సినిమాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న చిరంజీవికి ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ గా మిగిలిన ఆచార్య కథ ముగిసిపోయిందనుకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ లో చనిపోయిన విలన్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు తిరిగి కొత్త మలుపులు తీసుకుంటోంది. తన మానాన తాను దర్శకత్వానికి పరిమితం కాకుండా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ తదితర వ్యవహారాల్లో తలదూర్చడం ఎంత పెద్ద తప్పో దర్శకుడు కొరటాల శివకు తెలిసి వస్తోంది. నష్టాల తాలూకు పంచాయితీలకు ఇప్పటికే చాలా సమయం వృధా అయ్యింది. అటుపక్క తన కోసం వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ని మెప్పించేలా ఫైనల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకోలేకపోతున్నాడు. ఇవన్నీ ఇబ్బంది పెట్టేవే

సీడెడ్ తాలూకు లాస్, మిగిలిన ఏరియాలకు సంబంధించిన నష్టాలు ఇటీవలే సెటిలయ్యాయని ఫిలిం నగర్ టాక్. చరణ్ చిరులు 20 కోట్ల దాకా తమ రెమ్యునరేషన్ నుంచి వెనక్కు ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడో కొత్త ట్విస్టు తెరమీదకు వచ్చింది. ఆచార్య శాటిలైట్ హక్కులు కొన్న ఓ ప్రముఖ ఛానల్ దానికి ఇస్తానన్న మొత్తం 15 కోట్లు. షూటింగ్ దశలోనే ఈ ఒప్పందం జరిగింది. అప్పుడు క్యాస్టింగ్ లో కాజల్ అగర్వాల్ ఉంది. తర్వాత ఏవేవో కారణాలు చెప్పి ఆ పాత్రను లేపేశారు. కట్ చేస్తే ఇప్పుడు దాన్నే సాకుగా చూపి కేవలం ఏడున్నర కోట్లకే సెటిల్ చేయాలని సదరు ఛానల్ ఒత్తిడి చేస్తోందని వినికిడి. లేకపోతే అడ్వాన్స్ వెనక్కు ఇవ్వమని చెప్పారట.

ఒకవేళ వెనక్కు ఇచ్చే పనైతే వేరే ఛానల్ కు అమ్ముకోవచ్చు. కానీ ఇప్పుడు దాని మీద టీవీ వర్గాల్లో ఏమంత ఆసక్తి లేదు. ఒకవేళ ఆఫర్ ఇచ్చినా మహా అయితే అయిదు కోట్ల లోపే వస్తుంది తప్ప అంతకన్నా ఎక్స్ పెక్ట్ చేయలేం. దీని తాలూకు సెటిల్ మెంట్ కూడా కొరటాలనే చేయాల్సి ఉందట. మొత్తానికి ఇలా దెబ్బ మీద దెబ్బ ఆచార్యను వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో మృగరాజు, బిగ్ బాస్ లాంటి డిజాస్టర్స్ ఎన్ని ఉన్నప్పటికీ చిరంజీవి సినిమాకు ఎప్పుడూ ఈ పరిస్థితి రాలేదు. ఆఖరికి కొనేసుకున్న ఛానల్ సైతం వెనుకడుగు వేయడం అంటే చాలా అరుదుగా జరుగుతుంది. ఇవన్నీ అధికారికంగా చెప్పకపోయినా మీడియా డిస్కషన్స్ జోరుగా ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి