iDreamPost

రిక్రూట్ మెంట్ లో ఆమె కాదు.. అతడు.. న్యాయపోరాటం చేసిన యువతి

రిక్రూట్ మెంట్ లో ఆమె కాదు.. అతడు.. న్యాయపోరాటం చేసిన యువతి

పోలీసు రిక్రూట్ మెంట్ లో ఓ యువతి అబ్బాయి అని తేలడంతో ఆమెకు రావాల్సిన ఉద్యోగం నుంచి పక్కకు పెట్టేశారు. దీంతో ఆమె న్యాయపోరాటం చేసి చివరకు విజయం సాధించింది. 2018 నుంచి చేస్తున్న పోరాటంటో ఆమె సక్సెస్ సాధించింది. రెండు నెలల్లో అపాయింట్ మెంట్ ఇప్పించాలని బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

2018లో ఓ యువతి నాసిక్ రూరల పోలీస్ రిక్రూట్ మెంట్ కు 2018లో ఎస్సీ కేటగిరి కింద దరఖాస్తు చేసుకుంది. రాత పరీక్ష, ఇతరత్రా ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యింది. దీంతో తనకు పోలీసు ఉద్యోగం పక్కా అనుకుంది. అయితే.. మెడికల్ ఎగ్జామ్ లో అనూహ్య నివేదిక బయటపడింది. జననాంగాలు లేవని గుర్తించారు. మరో పరీక్ష నిర్వహిస్తే.. అందులో ఆడ-మగ క్రోమోజోమ్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె కాదు, అతడు అని నిర్ధారించి పక్కకు పెట్టేశారు.

దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకున్న జన్యుపరమైన సమస్య గురించి తెలియదని, పుట్టినప్పటి నుంచి తాను మహిళగానే పెరిగినట్లు వెల్లడించింది. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించింది. పలు దఫాలుగా దర్యాప్తు జరిగింది. క్రోమోజోమ్ టెస్టుల ద్వారా ఆమెను పురుషుడిగా గుర్తించడం ఏ మాత్రం సరికాదని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సానుభూతి ధోరణితో ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని పోలీసు శాఖ సమ్మతించిందని అడ్వకేట్ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఆమె న్యాయపోరాటం ద్వారా గెలుపొందింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి