iDreamPost

అమ్మ కోసం.. పాక్‌ నుంచి కడపకు..

అమ్మ కోసం.. పాక్‌ నుంచి కడపకు..

అమ్మపై ప్రేమ ముందు దేశాలు, శతృత్వాలు అడ్డుకాదని మరోసారి రుజువైంది. తల్లిని చూడాలన్న ఆరాటంతో దాయాది దేశం పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు వచ్చాడు ఓ వ్యక్తి. ఎన్నో కష్టాలను భరించి చివరికి కన్నతల్లి చెంతకు చేరాడు. వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వేకోడూరు పరిధిలోని వై కోట గ్రామానికి చెందిన షేక్‌నూరా అనే మహిళ గతంలో జీవనోపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లారు. అక్కడ 1997లో పాకిస్థాన్‌కు చెందిన జాఫర్‌ సాహిద్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించగా వలీద్‌ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత వ్యక్తిగత కారణాలతో భార్తభర్తలు విడిపోయారు. భర్త కుమారుడిని తీసుకొని పాక్‌ వెళ్లిపోయాడు. నిస్సహాయురాలైన నూరా ఇండియాకు తిరిగొచ్చారు. ప్రస్తుతం ఆమె రైల్వేకోడూరు నివాసం ఉంటున్నారు.

ఇటీవల తండ్రి జాఫర్‌ తన కుమారుడికి తల్లి గురించి చెప్పాడు. దీంతో తన తల్లిని చూడాలనే కోరికతో వలీద్‌ టూరిస్ట్‌ వీసాపై ఇండియా వచ్చేశాడు. తర్వాత తండ్రి చెప్పిన వివరాల ప్రకారం రైల్వేకోడూరు చేరుకొని ఎట్టకేలకు తల్లిని కలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు వారిని కలిసి వివరాలు సేకరించారు. వలీద్‌కు ఇండియాలో 45 రోజులు మాత్రమే గడువు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎలాంటి నిబంధనలను అతిక్రమించకూడదని అతనికి స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ అనుమతితో తల్లి వద్దే ఉండాలని అనుకుంటున్నానని, దీనికోసం ప్రయత్నిస్తానని వలీద్‌ చెబుతున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి