iDreamPost

90 ఏళ్ల వయస్సులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!

సాధారణంగా వయస్సు మీద పడుతున్న కొద్దీ.. ముసలి వారు ఇళ్లకే పరిమితం అవుతారు. కానీ, అమెరికాకు చెందిన ఓ బామ్మ మాత్రం వీరికి విరుద్ధంగా.. తొమ్మిది పదుల వయస్సులో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సాధారణంగా వయస్సు మీద పడుతున్న కొద్దీ.. ముసలి వారు ఇళ్లకే పరిమితం అవుతారు. కానీ, అమెరికాకు చెందిన ఓ బామ్మ మాత్రం వీరికి విరుద్ధంగా.. తొమ్మిది పదుల వయస్సులో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

90 ఏళ్ల వయస్సులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనే సామెతకు ఉదాహరణగా నిలిచింది ఓ బామ్మ. సాధారణంగా వయస్సు మీద పడుతున్న కొద్దీ.. ముసలి వారు ఇళ్లకే పరిమితం అవుతారు. పెరుగుతున్న వయస్సుతో పాటు ఇంకా అనారోగ్య సమస్యలు కూడా తోడైతే.. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడో కొంతమంది ఆరోగ్యంగా ఉన్నా సరే.. ఇంట్లోనే  పుస్తకాలూ చదువుతోనో, దైవచింతనలోనో.. ఇలా ఎవరికి  నచ్చిన విధంగా వారు కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ, అమెరికాకు చెందిన ఓ బామ్మ మాత్రం వీరికి విరుద్ధంగా.. తొమ్మిది  పదుల  వయస్సులో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసుకుని.. అందరిచేత ప్రశంసలు పొందుతుంది.

అమెరికాకు చెందిన ఈ వృద్ధురాలి పేరు మిన్నీ పేన్. ఆమె వయస్సు దాదాపు 80 సంవత్సరాలు ఉంటుంది. ఇంత వయస్సు వచ్చినా కూడా ఈ బామ్మకు మాత్రం చదువుకోవాలనే కోరిక చావలేదు. దానికి కారణం, ఆమె తన  చిన్నతనంలో హై స్కూల్ వరకు మాత్రమే చదువుకుంది. 1950లో ఆమె తన హై స్కూల్ విద్యను పూర్తి చేసి రియల్ ఎస్టేట్ సంస్థలో క్లర్క్ గా జాయిన్ అయింది. ఆ తర్వాత ఓ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయురాలిగా  పనిచేసింది. కొంతకాలానికి 1961లో డేల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. అలా కొన్నాళ్ళు పిల్లల ఆలనా పాలన చూసుకుని తర్వాత తిరిగి కెరీర్ ను ప్రారంభించింది. ఈ బామ్మ ట్రాన్స్ క్రిపషినిస్ట్  వర్డ్ ప్రాసెసర్ గా దాదాపు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా తన ఉద్యోగాన్ని కొనసాగిచింది. ఆ తర్వాత 68ఏళ్ళ వయస్సులో ఉద్యోగ విరమణను తీసుకుంది.

old lady completed her post graduation

చిన్న తనంలో ఉన్నత చదువులు చదివే అవకాశం లేకపోవడంతో.. మిన్నీ పేన్ తన సెకండ్ ఇన్నింగ్స్  లో తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంది. అమెరికాలోని టెక్సాస్ ఉమెన్స్ యూనివర్సిటీలో చేరింది. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ లో భాగంగా జర్నలిజం, బిజినెస్ కోర్సులను తీసుకుంది. తనకు 73 సంవత్సరాలు వచ్చేటప్పటికి తన అండర్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకుంది. అక్కడితో ఆగిపోకుండా, మరింత ఉత్సాహంతో ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ లో మాస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేసుకుని.. అత్యంత వృద్ధ వయస్సులో పీజీ చేసిన మహిళగా రికార్డు సృష్టించింది ఈ బామ్మ. అంతే కాకుండా తన మనవడితో కలిసి స్టేజి పైకి వెళ్లి డిగ్రీని అందుకుంటూ.. అక్కడున్న అందరి దృష్టిని ఆకట్టుకుంది మిన్నీ పేన్.

వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలను సైతం అధిగమించి, తను అనుకున్న కలను నెరవేర్చుకుని.. తన తోటి గ్రాడ్యుయేట్స్ కు స్ఫూర్తిగా నిలిచింది. చదువుకునేందుకు అన్ని వసతులు కలిపిస్తున్నా సరే, చదువుని అశ్రద్ధ చేస్తున్న.. నేటి తరం వారికి వృద్ధాప్యంలో పీజీ పూర్తి చేసుకున్న మిన్నీ పేన్ ఓ గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ఏదేమైనా, తమ ఆశయాలను నెరవేర్చుకోడానికి వయస్సుతో సంబంధం లేదని.. కేవలం సంకల్పం ఉంటే చాలని  మిన్నీ పేన్   నిరూపించింది. మరి, విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో పీజీ పట్టాను తీసుకున్న ఈ బామ్మపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి