iDreamPost

అన్ బ్రాండెడ్ బియ్యం, ప‌ప్పులైనా స‌రే, 5% GST బాదుడే

అన్ బ్రాండెడ్  బియ్యం, ప‌ప్పులైనా స‌రే, 5% GST బాదుడే

బ్రాండెడ్ కొంటే కదా ఇబ్బంది అన్ బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ కొని GST నుంచి తప్పించుకోవ‌చ్చున‌నుకొంటున్నారా? అయినా వడ్డింపు తప్పదు. ఎందుకంటే అన్ని ప్రీప్యాక్డ్, లేబుల్డ్ ధాన్యాలు, పప్పులు, పిండి కూడా 5% GST పరిధిలోకే వస్తాయి. జూలై 18 వరకు ఈ పన్ను రిజిస్టర్ అయిన బ్రాండెడ్ ఆహార వస్తువులకే వర్తించేది. ఇప్పుడది ముందుగానే ప్యాక్ చేసి లేబులేసిన వస్తువులకు కూడా వర్తిస్తుంది. అంటే పెరుగు, లస్సీ లాంటి ప్రీ ప్యాకేజ్డ్ వస్తువులకు కూడా ఇప్పుడు 5% GST చెల్లించాలి.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఏమందంటే.. 25 కిలోలు/ 25లీటర్లు లేదా అంతకంటే తక్కువ బరువుండే కొన్ని ప్రీ ప్యాకేజ్డ్ ఆహార వస్తువులకూ GST వర్తిస్తుంది. 25 కిలోలు/ 25లీటర్లకు మించి ఒకే ప్యాకేజ్ గా ప్యాక్ చేసిన ప‌ప్పులు, గోధుమలు GST కిందికి రావు. అలా కాకుండా వేర్వేరు ప్యాకెట్ల రూపంలో కొంటే GST పడుతుంది. ఒకవేళ రీటైలర్ 25 కిలోల ప్యాక్ కొని దాన్ని లూజ్ గా అమ్మితే అది GST పరిధిలోకి రాదు. GST సవరణల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే అంతర్జాతీయంగా ధరలు పడిపోతున్నందువల్ల ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి