iDreamPost

West Indies: క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఒకేసారి నలుగురు ప్లేయర్లు రిటైర్మెంట్!

ప్రపంచ క్రికెట్ లో సంచలనం నమోదు అయ్యింది. ఒకేసారి నలుగురు క్రికెటర్లు తమ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో సంచలనం నమోదు అయ్యింది. ఒకేసారి నలుగురు క్రికెటర్లు తమ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

West Indies: క్రికెట్ చరిత్రలో సంచలనం.. ఒకేసారి నలుగురు ప్లేయర్లు రిటైర్మెంట్!

సాధారణంగా ఒక ఏజ్ అంటూ వచ్చాక, తమ కెరీర్ కు గుడ్ బై చెబుతుంటారు ఆటగాళ్లు. అయితే మరికొందరు మాత్రం అనుకోని రీజన్స్ వల్ల తమ కెరీర్ ను అర్ధాంతరంగా ముగిస్తుంటారు. ఇవన్నీ క్రీడాకారుల జీవితాల్లో సర్వసాధారణమే. కానీ ఒకేసారి నలుగురు ప్లేయర్లు, అది కూడా ఒకేదేశానికి చెందిన వారు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నామని చెబితే.. ప్రపంచ క్రికెట్ లో ఇదొక సంచలనమే. తాజాగా నలుగురు ప్లేయర్లు వారు కూడా ప్రపంచ ఛాంపియన్లు కట్టకట్టుకుని క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. మరి ఆ ప్లేయర్లు ఎవరు? ఎందుకు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు? వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో సంచలనం నమోదు అయ్యింది. ఒకేసారి నలుగురు క్రికెటర్లు తమ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. వెస్టిండీస్ కు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు అనిషా మహ్మద్, షకేరా సెల్మాన్, కైసియా నైట్, కైషోనా నైట్ లు ఒకేసారి ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయం తెలిసి వరల్డ్ క్రికెట్ షాక్ కు గురైంది. పైగా వీళ్లందరూ వెస్టిండీస్ ప్రపంచ ఛాంపియన్లు కావడం గమనార్హం. 2016లో భారత్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న జట్టులో ఈ నలుగురు సభ్యులుగా ఉన్నారు. ఇక వీరు మూకుమ్మడిగా రిటైర్మెంట్ తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

Retirement of four players at once!

ప్రస్తుతం విండీస్ క్రికెట్ బోర్డ్ పరిస్థితి ఏమంత బాగోలేదు. పైగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ కారణంగానే విండీస్ కు చెందిన పలువురు మెన్స్ క్రికెటర్లు వరల్డ్ వైడ్ గా ఉన్న టీ20 లీగ్ ల్లో ఆడేందుకు మెుగ్గుచూపుతున్నారు. దాంతో తాము ఆర్థికంగా స్థిరత్వం పొందొచ్చు అనేది వారి భావన. ఈ క్రమంలోనే ఈ నలుగురు కూడా ఇదే కారణంగతో తమ కెరీర్ లకు ముగింపు పలుకుతున్నారని అక్కడి మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కాగా.. ఈ నలుగురిలో కైసియా నైట్, కైషోనా నైట్ లు అక్కాచెల్లెల్లు కావడం విశేషం. వీరందరూ దశాబ్దకాలం పాటు విండీస్ జట్టుకు తమ సేవలను అందించారు. మరి ఓకేసారి నలుగురు ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి