iDreamPost
android-app
ios-app

iPhone స్టోరేజ్ సరిపోవడం లేదా? ఐతే ఈ డివైజ్ మీ కోసమే.. ధర కూడా తక్కువే!

4 In 1 Pendrive For iPhone: ఐఫోన్ ఉన్న చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ స్టోరేజ్ స్పేస్ సరిపోకపోవడం. గట్టిగా ఒక నాలుగు వీడియోలు, కొన్ని ఫోటోలు తీస్తే నిండిపోయి సంపుద్ది. అన్ని వేలు పెట్టి కొంటే స్టోరేజ్ స్పేస్ సరిపోవడం లేదా? చీప్ వెరీ చీప్ అని ఆండ్రాయిడ్ ఫెల్లోస్ అవమానించకముందే ఈ స్టోరేజ్ ప్రాబ్లమ్ నుంచి బయటపడండిలా. 

4 In 1 Pendrive For iPhone: ఐఫోన్ ఉన్న చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ స్టోరేజ్ స్పేస్ సరిపోకపోవడం. గట్టిగా ఒక నాలుగు వీడియోలు, కొన్ని ఫోటోలు తీస్తే నిండిపోయి సంపుద్ది. అన్ని వేలు పెట్టి కొంటే స్టోరేజ్ స్పేస్ సరిపోవడం లేదా? చీప్ వెరీ చీప్ అని ఆండ్రాయిడ్ ఫెల్లోస్ అవమానించకముందే ఈ స్టోరేజ్ ప్రాబ్లమ్ నుంచి బయటపడండిలా. 

iPhone స్టోరేజ్ సరిపోవడం లేదా? ఐతే ఈ డివైజ్ మీ కోసమే.. ధర కూడా తక్కువే!

ఐఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ స్టోరేజ్ స్పేస్ సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ వీడియోలు, ఎక్కువ ఫోటోలు రికార్డ్ చేద్దామంటే స్టోరేజ్ లేదు అని వార్నింగ్ ఇస్తుంది. పోనీ ఓల్డ్ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేద్దామంటే మనసొప్పదు. డీఫాల్ట్ గా యాపిల్ కంపెనీ ఇచ్చే క్లౌడ్ స్టోరేజ్ సరిపోదు. పోనీ ఐఫోన్ కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేద్దామంటే కన్వర్టర్ ఉండాలి. ఎహె ఇవన్నీ కాదు.. ఐఫోన్ కి సెట్ అయ్యే పెన్ డ్రైవ్ ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదూ. అయితే మీ కోసమే ఈ గాడ్జెట్. దీన్ని మీరు ఐఫోన్ కి, ఆండ్రాయిడ్ ఫోన్ కి నేరుగా కనెక్ట్ చేసి పెన్ డ్రైవ్ గా (అదనపు స్టోరేజ్ డివైజ్ గా) వాడుకోవచ్చు. నిండిపోయిన తర్వాత కంప్యూటర్ లో లేదా మ్యాక్ సిస్టంలో గానీ కాపీ చేసుకోవచ్చు. 

బ్రాండ్స్:

ఇందులో వెరిలక్స్ కంపెనీకి చెందిన డివైజ్ లు, కిన్ సౌండ్ కంపెనీకి చెందిన డివైజ్ లు ఉన్నాయి. 64 జీబీ స్టోరేజ్ తో 4 ఇన్ వన్ పెన్ డ్రైవ్ వస్తుంది. ఇది మైక్రో యూఎస్బీ, టైప్ సీ, లైటెనింగ్ ఇంటర్ఫేస్ తో మినీ హ్యాంగబుల్ పెన్ డ్రైవ్ గా వస్తుంది. అంటే మీరు దీన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకి, ట్యాబ్ లకి, కంప్యూటర్లతో సహా చాలా డివైజ్ లకి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని అసలు ధర ఆన్ లైన్ లో రూ. 2,245 ఉండగా ఆఫర్ లో రూ. 1349కే లభిస్తుంది. ఇది వెండి రంగులో లభిస్తుంది. ఇందులోనే రోజ్ గోల్డెన్ కలర్ లో ఒకటి ఉంది. దీని ధర రూ. 1379. వెరిలక్స్ బ్రాండ్ లోనే 256 జీబీ పెన్ డ్రైవ్ ఒకటి ఉంది. ఇది కూడా ఐఫోన్, ఐప్యాడ్, పీసీ, ల్యాప్ టాప్, మ్యాక్ సిస్టం, ఆండ్రాయిడ్ ఫోన్స్ వంటి వాటికి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని అసలు ధర ఆన్ లైన్ లో రూ. 4,499 ఉండగా ఆఫర్ లో రూ. 2,989కే వస్తుంది. కిన్ సౌండ్ 64 జీబీ పెన్ డ్రైవ్ అయితే రూ. 1398కే వస్తుంది. 

మీ ప్రాబ్లమ్ సాల్వ్:

యూఎస్బీ మేల్ పోర్ట్ ఒకటి, ఒకటి ఐఓఎస్ డివైజ్ మేల్ పోర్ట్, మిగతా రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ కి సంబంధించిన మేల్ పోర్టులు.. మొత్తం 4 మేల్ పోర్టులతో వస్తుంది. దీన్ని మీ ఐఫోన్ కి లేదా ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేసుకుని పెన్ డ్రైవ్ గా వాడుకోవచ్చు. 64 జీబీ నుంచి 256 జీబీ వరకూ స్టోరేజ్ వస్తుంది. కాబట్టి ఇష్టమొచ్చినట్టు ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. పెన్ డ్రైవ్ నిండిపోయాక మీ పీసీ లేదా మ్యాక్ సిస్టంలో హార్డ్ డ్రైవ్ లో బ్యాకప్ పెట్టుకోవచ్చు. 

ఇక్కడ కొనండి:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి