iDreamPost

OTTలోకి వచ్చేసిన 4 హిట్ సినిమాలు.. ఆ మూవీ మాత్రం మిస్ కావొద్దు..

OTT Suggestions- Must Watch Movie: ఈ వారం ఓటీటీలో మూవీస్ మెగా జాతర ఉంది. ఎందుకంటే ఏకంగా 4 హిట్ సినిమాలు రాబోతున్నాయి. మరి.. ఏ ప్లాట్ ఫామ్ లోకి వస్తాయి? వాటిలో ఏది మస్ట్ వాచ్ మూవీనో చూడండి.

OTT Suggestions- Must Watch Movie: ఈ వారం ఓటీటీలో మూవీస్ మెగా జాతర ఉంది. ఎందుకంటే ఏకంగా 4 హిట్ సినిమాలు రాబోతున్నాయి. మరి.. ఏ ప్లాట్ ఫామ్ లోకి వస్తాయి? వాటిలో ఏది మస్ట్ వాచ్ మూవీనో చూడండి.

OTTలోకి వచ్చేసిన 4 హిట్ సినిమాలు.. ఆ మూవీ మాత్రం మిస్ కావొద్దు..

ఓటీటీలో ఈ వారం మెగా మూవీ జాతర ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒకేరోజు టాప్ హీరో చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు, సూపరి హిట్ చిత్రాలు 4 ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ మూవీ ఒకటి. ఈ మూవీకి రజినీకాంత్ కుమార్తె డైరెక్టర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిగా.. ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. కానీ, ఈ మూవీకి సంబంధించి కొంత ఫుటేజ్ డిలీట్ అయ్యిందని చెప్పిన తర్వాత ఈ సినిమాపైఅంచనాలు పెరిగాయి. కాబట్టే ఈ మూవీ ఓటీటీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి ఏప్రిల్ 12న రాబోతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించి చాలానే అంచనాలు అయితే ఉన్నాయి.

ఈ లిస్ట్ లో రెండో చిత్రం గామి. ఈ మూవీ కూడా ఏప్రిల్ 12నే ఓటీటీలోకి రాబోతోంది. జీ5లో ఈ గామి చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇలాంటి సినిమా రావాలి అంటే ఇంకో దశాబ్దం పడుతుంది అంటూ ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ క్రిటిక్స్ కూడా కామెంట్స్ చేశారు. ఈ మూవీ కోసం టీమ్ దాదాపు 8 ఏళ్లు కష్టపడింది. నిజంగా ఎలాంటి ఎలివేషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కథ, టేకింగ్ ఆధారంగానే ఈ సినిమాతో టీమ్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ప్రస్తుతం ఎంతో తెలుగు ఆడియన్స్ ఈ గామి చిత్రం ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.

ఏప్రిల్ 12న రాబోతున్న ఇంకో చిత్రం ప్రేమలు. ఈ మలయాళం సినిమా వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసిన బజ్ ఏంటో అందరూ చూశారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. ఏకంగా రూ.135 కోట్లు కొల్లగొట్టింది. ఈ మూవీకి వచ్చిన హైప్ చూసి తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 12న ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీని అత్యధిక శాతం హైదరాబాద్ లోనే షూట్ చేశారు. కాబట్టి తెలుగు ప్రజల్లో ఈ సినిమాపై మంచి ఆసక్తి కూడా ఉంది. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వస్తోంది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇంక ఏప్రిల్ 12న రాబోతున్న మరో సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో సూపర్ సక్సెస్ అయ్యింది. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మూడు వారలకే ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తూ వచ్చారు. ఈ నాలుగు చిత్రాల్లో గామి స్పెషల్ అని చెప్పాలి. ఆ మూవీ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. మరి.. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి