iDreamPost

రేయ్.. ఎవర్రా మీరంతా.. ఒక్క ఉద్యోగానికి ఇంత మందా..?

దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రభావం కార్పొరేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో తమ ఉద్యోగులకు స్వస్థి చెబుతోంది. ముఖ్యంగా ఐటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగులను లే ఆఫ్స్ చేస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లేకపోవడంతో.. చిన్న ఉద్యోగానికి కూడా తండోపతండాలుగా వస్తున్నారు నిరుద్యోగులు

దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రభావం కార్పొరేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో తమ ఉద్యోగులకు స్వస్థి చెబుతోంది. ముఖ్యంగా ఐటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగులను లే ఆఫ్స్ చేస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లేకపోవడంతో.. చిన్న ఉద్యోగానికి కూడా తండోపతండాలుగా వస్తున్నారు నిరుద్యోగులు

రేయ్.. ఎవర్రా మీరంతా.. ఒక్క ఉద్యోగానికి ఇంత మందా..?

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నడుస్తోంది. ఇది దేశంపై కూడా తీవ్ర ప్రభావాన్నిచూపుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా రెసిషన్ పీరియడ్ నడుస్తోంది. దీంతో చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి కార్పొరేట్ కంపెనీలు. ఇందులో బడా కంపెనీలు అతీతమేమీ కాదు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులను లే ఆఫ్ చేసేశాయి ఐటీ కంపెనీలు. అందులో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ ఐటి సంస్థలే కాదూ.. బైజూస్, మీషో, వేదాంత్, కార్స్ 24 వంటి వంటి మల్టీ నేషనల్ కంపెనీలు కూడా తమ ఎంప్లాయిస్‌ను ఇంటికి సాగనంపాయి. కొత్త ఉద్యోగాల కల్పన ఉండటం లేదు. దీంతో నిరుద్యోగుల శాతం నానాటికి పెరిగిపోతుంది. అందుకు ఉదాహరణ ఈ చిన్న సంఘటన.

మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటీఫికేషన్ విడుదల అవ్వగానే.. పెద్ద ఎత్తున అప్లికేషన్లు రావడం సహజంగా మారింది. ఫ్యూన్ ఉద్యోగానికి కూడా పీహెచ్‌డీ చదివిన వాళ్లు దరఖాస్తు చేస్తున్నారంటే..నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిదీ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అంత ఆసక్తి చూపరు. అయితే హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి పిలుపునివ్వగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ఎన్ని ఉద్యోగాలకు అనుకుంటున్నారు.. కేవలం ఒక్క ఉద్యోగానికి అట. ఈ ఉద్యోగానికి సుమారు ఓ 50 మంది వస్తారని ఊహించారు. కానీ ఏకంగా 300 మందికి పైగా అభ్యర్థులు వచ్చారు.

ఆ వాక్ ఇన్ ఇంటర్వ్యూ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. జాతరకు తండోపతండాలుగా వెళ్లినట్లు.. ఆ ఒక్క ఉద్యోగానికి రావడంతో అక్కడ కాస్తంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంపెనీ గేటు బయట నుండి లోపలికి వరకు ఇసకేస్తే రాలనంత జనం ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో రెసిషన్ వల్ల ఉద్యోగాలు లేకపోవడంతో.. ఓ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. కొత్తగా ఆ రంగంలోకి వెళదామనుకుంటున్న ఆశావాహులు. అలాగే దేశంలో ప్రస్తుత నిరుద్యోగ పరిస్థితులపై చర్చించేలా చేసింది ఈ వీడియో. ఎక్కువ మంది నెటిజన్లు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం గురించే చర్చిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి