iDreamPost

షవర్మా తిని ప్రాణాలు పొగొట్టుకున్నాడు..

ఫుడ్ యాప్స్ వచ్చాక.. వంట చేసుకుని తినే వారి శాతం తగ్గిపోతుంది. కనీసం వారాంతంలో అయిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని లాగించేస్తున్నారు. ఎలా చేస్తున్నారో సంబంధం లేదు. కేవలం రుచిగా అనిపిస్తే చాలు.. కుుటంబం మొత్తం భోజన హోటళ్లను పెంచి పోషిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు.. ఆ ఫుడ్ కారణంగా చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి.

ఫుడ్ యాప్స్ వచ్చాక.. వంట చేసుకుని తినే వారి శాతం తగ్గిపోతుంది. కనీసం వారాంతంలో అయిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని లాగించేస్తున్నారు. ఎలా చేస్తున్నారో సంబంధం లేదు. కేవలం రుచిగా అనిపిస్తే చాలు.. కుుటంబం మొత్తం భోజన హోటళ్లను పెంచి పోషిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు.. ఆ ఫుడ్ కారణంగా చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి.

షవర్మా తిని ప్రాణాలు పొగొట్టుకున్నాడు..

మనుషుల బద్దకం, బిజీ లైఫ్ కారణంగా.. ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి తగ్గిపోయింది. భార్యా, భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసి అలసి పోతుండటంతో.. ఇంటికి వచ్చి వంట చేసుకోలేక.. కుటుంబం మొత్తానికి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. శుచి, శుభ్రతతో పని లేదు. ఎలా వండుతున్నారో సంబంధం ఉండదు, తెలిసే అవకాశాలు లేవు. నోటికి రుచిగా ఉంటే చాలు.. లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. అర చేతిలో ఫోన్.. ఆర్డర్ చేసుకునేందుకు యాప్స్ ఎలానో ఉన్నాయి. ఇక చక చక యాప్స్ తెరచి.. టక టకా ఆర్డర్స్ పెట్టేస్తున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్.. మనుషుల ప్రాణం మీదకు తెస్తోంది. తాజాగా ఓ వ్యక్తి తనకిష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుని..తిన్నాడు. కానీ అది వికటించి చనిపోయాడు.

షవర్మా తిని కేరళకు చెందిన వ్యక్తి  తీవ్ర అస్వస్థతకు గురై.. ఆసుపత్రి పాలై చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కొట్టాయం నివాసి అయిన 24 ఏళ్ల రాహుల్ నాయర్.. ఈ నెల 18న లే హయాత్ రెస్టారెంట్ నుండి షవర్మాను ఆర్డర్ చేశారు. షవర్మా తిన్న తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని మరుసటి రోజు సన్ రైజ్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యాడు. అయితే బలహీనంగా మారిపోవడం.. ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో తిరిగి అక్టోబర్ 22న ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచారు. పరిస్థితి విషమించి రాహుల్ బుధవారం ప్రాణాలు వదిలాడు.

ఆహారం విషతుల్యం జరగడం వల్లే రాహుల్ చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే షవర్మా వల్ల జరిగిందా అనేది నిర్ధారించేందుకు పరీక్షలు చేపట్టగా.. ఫలితాలు తేలాల్సి ఉంది. రాహుల్ కిడ్నీ, కాలేయం పాడైపోయి గుండెపోటుకు గురై చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. షవర్మా వల్లే తన కుమారుడు చనిపోయాడన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో త్రిక్కాకర మున్సిపాలిటీ ఆరోగ్య శాఖ.. ఈ రెస్టారెంట్‌ను మూసివేసింది. రాహుల్ మరణానికి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి