iDreamPost

ఓటీటిలో ఈ వారం సందడే సందడి.. ఒకేసారి 24 సినిమాలు రిలీజ్!.

ఇటీవల సినిమా థియేటర్ల కన్నా ఎక్కువగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వచ్చే సినిమాలకు ప్రజలు జై కొడుతున్నారు. కొత్త సినిమాలు కొద్ది రోజుల్లో ఓటీటీలో రావడంతో ఎక్కువ శాతం అటువైపే మొగ్గు చూపిస్తున్నారు.

ఇటీవల సినిమా థియేటర్ల కన్నా ఎక్కువగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వచ్చే సినిమాలకు ప్రజలు జై కొడుతున్నారు. కొత్త సినిమాలు కొద్ది రోజుల్లో ఓటీటీలో రావడంతో ఎక్కువ శాతం అటువైపే మొగ్గు చూపిస్తున్నారు.

ఓటీటిలో ఈ వారం సందడే సందడి.. ఒకేసారి 24 సినిమాలు రిలీజ్!.

ఇటీవల సినిమాలు థియేటర్లలో మిస్ అయిన వారికి హెచ్‌డీ క్వాలిటీతో ఇంట్లో కూర్చొని చూసుకునే అవకాశం దొరుకుతుంది. ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడం.. దాంతో ఓటీటీ వేదికలకు మహర్ధశ పట్టిందని చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషలకు సంబంధించిన చిత్రాలు హాయిగా ఇంట్లో వీక్షించే వెసులు బాటుతో చాలా మంది ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలు, వెబ్ సీరీస్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే లేటెస్ట్ మూవీస్, వెబ్ సీరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీలో  సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేయబోతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఇటీవల చాలా మంది జనాలు థియేటర్లకు వెళ్లడం మాని.. ప్రశాంతంగా ఇంట్లోనే ఓటీటీలో వస్తున్న సినిమాలు చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే హిట్.. ఫ్లాప్ సినిమాలు ఓటీటీలో వస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ఓటీటీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మరి వస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు భారీ మొత్తం ఇచ్చి మరీ సినిమాలు, వెబ్ సీరీస్ లను కొంటున్నాయి. సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 చిత్రాలు సందడి చేయబోతున్నాయి. శుక్రవారం ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్, ధృవ నక్షత్రం మూవీస్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అదే సమయంలో ఓటీటీలో 24 మూవీస్ తో పాటు వెబ్ సీరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్ లో రాబోయే మూవీస్, వెబ్ సీరీస్:

  • నవంబర్ 20- స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఆంగ్ల చిత్రం)
  • నవంబర్ 21 – లియో (ఆంగ్ల చిత్రం)
  • నవంబర్ 22- స్క్విడ్ గేయమ్ : ది చాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సీరీస్)
  • నవంబర్ 23 – మై డామెన్ (జపానీస్ సీరీస్)
  • నవంబర్ 23 – పులిమడ (మాలీవుడ్ మూవీ)
  • నవంబర్ – 24 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సీరీస్)
  • నవంబర్ 24- ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానీష్ చిత్రం)
  • నవంబర్ 24- గ్రాన్ టరిష్మో (ఆంగ్ల చిత్రం)
  • నవంబర్ 24 – లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కీ మూవీ)
  • నవంబర్ 26 – ద మెషీన్ (ఆంగ్ల చిత్రం)

అమెజాన్ ప్రైమ్ లో రాబోయే మూవీస్, వెబ్ సీరీస్:

  • నవంబర్ 24 – ఎల్ఫ్ మి (ఇటాలియన్ మూవీ)
  • నవంబర్ 24- ది విలేజ్ (తమిళ సీరీస్)

అమెజాన్ మినీ టీవీ :

  • నవంబర్ 22 – స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రాబోయే మూవీస్, వెబ్ సీరీస్:

  • నవంబర్ 21 – ఫర్గో : సీజన్ 5 (ఆంగ్ల సీరీస్)
  • నవంబర్ 23 (రూమర్ డేట్) – చిన్నా (తెలుగు డబ్బింగ్ సినిమా)

జీ5 రాబోయే వెబ్ సీరీస్:

  • నవంబర్ 24 – ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ : సీజన్ 4 ( హిందీ వెబ్ సీరీస్)

అమెజాన్ మినీ టీవీలో రాబోయే వెబ్ సీరీస్:

  • నవంబర్ 22 – స్లమ్ గల్ఫ్ (హిందీ వెబ్ సీరీస్)

జియో సినిమా రాబోయే వెబ్ సీరీస్:

  • నవంబర్ 23 – ది గుడ్ ఓల్డ్ డేస్ ( తెలుగు వెబ్ సీరీస్)

బుక్ మై షో రాబోయే సినిమాలు :

  • నవంబర్ 22 – ఒపన్ హై మర్ (ఆంగ్ల చిత్రం)
  • నవంబర్ 24 – UFO స్వీడన్ ( స్వీడన్ చిత్రం)

సోనీ లివ్ రాబోయే సినిమాలు :

  • నవంబర్ 24- చావెర్ (మాలీవుడ్ మూవీ)
  • నవంబర్ 24 – సతియా సోతనాయ్ (తమిళ చిత్రం)

ఆహా లో..

  • నవంబర్ 24 – బాలకృష్ణ.. అన్ స్లాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (ఎనిమల్ టీమ్ ఎపిసోడ్)

ఆపిల్ ప్లస్ టీవీ రాబోయే సినిమాలు :

  • నవంబర్ 22 – హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఆంగ్ల చిత్రం)

ఈ-విన్ లో రాబోయే సినిమాలు :

  • నవంబర్ 24 – ఒడియన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి