iDreamPost

ఒక్క రోజులోనే 4 లక్షల కేజీల చికెన్.. 30 వేల క్వింటాళ్ల మటన్ కుమ్మేశారు

  • Published Jan 01, 2024 | 12:46 PMUpdated Jan 01, 2024 | 12:46 PM

తెలంగాణాలో నిన్న ఆదివారం ఒక్కరోజు మందు, మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను. డిసెంబర్ 31 అంటేనే ఎంజాయ్ మెంట్ డే అంటారు.. అది ఆదివారం రావడం మరింత జోష్ పెంచింది.

తెలంగాణాలో నిన్న ఆదివారం ఒక్కరోజు మందు, మాంసం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నాను. డిసెంబర్ 31 అంటేనే ఎంజాయ్ మెంట్ డే అంటారు.. అది ఆదివారం రావడం మరింత జోష్ పెంచింది.

  • Published Jan 01, 2024 | 12:46 PMUpdated Jan 01, 2024 | 12:46 PM
ఒక్క రోజులోనే 4 లక్షల కేజీల చికెన్.. 30 వేల క్వింటాళ్ల మటన్ కుమ్మేశారు

సాధారణంగా డిసెంబర్ 31 నైట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. యువత జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాత సంవత్సరానికి గుడ్ బై పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సంతోషంలో మునిగిపోతుంటారు. తెలంగాణలో కొత్త ఏడాది వస్తుందంటే.. డిసెంబర్ 31 రోజు ఎంత ఎంజాయ్ చేస్తారో కొత్తగా చెప్పనక్కరలేదు. ఆ రోజు మందు, చికెన్, మటన్ షాపులు బిజీ బీజీగా ఉంటాయి. ఈ ఏడాది డిసెంబర్ 31 ఆదివారం రావడంతో ఈ గిరాకి మరింత పెరిగిపోయింది. ఆదివారం కావడంతో ఉదయం నుంచి మటన్, చికెన్, చేపల మార్కెట్ లో జనాలు కిక్కిరిసి పోయారు. మందుషాపుల్లో బారులు తీరారు. నిన్న ఒక్కరోజే మటన్, చికెన్ ఎంతకొన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. గత ఏడాది రికార్డు బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 31, అందులోనూ ఆదివారం ఇంకేముంది.. జనాల ఎంజాయ్‌మెంట్ కి అడ్డులేకుండా పోయింది. దీంతో నాన్ వెజ్ షాపులు, మందు దుకాణాలు కిట కిటాడిపోయాయి. కొత్త ఎడాదిని మస్తు మస్తుగా ఎంజాయ్ చేశారు తెలంగాణ వాసులు. దీంతో నాన్ వెజ్ అమ్మకాలు గత ఏడాది కన్నా ఈ ఏడాది మరింత పెరిగినట్లు తెలుస్తుంది. మాములు రోజుల్లో 3 లక్షల కేజీల వరకు చికెన్ అమ్ముడుపోతుంది. కానీ నిన్న ఒక్కరోజే 4.5 లక్షల చికెన్ కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. కార్తీక మాసం అయిన తర్వాత మళ్లీ చికెన్ అమ్మకాలు పెరిగిపోయాయని.. నిన్న అది కాస్త రెట్టింపు అయ్యిందని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో చికెన్ రూ.230. నిన్న దాదాపు 10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీ రంగ నిపుణులు, నెక్ వైస్ ప్రిడెంట్ సుబ్బరాజు తెలిపారు.

ఇక మటన్ సైతం రికార్డు స్థాయిలో అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 25 నుంచి 30 వేల క్వింటాళ్ల మటన్ అమ్మడు పోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుం మార్కెట్ లో మటన ధర కిలో రూ.800 నుంచి రూ.900 వరకు పలుకుతుంది. అయినా కూడా మాంసాహారులు వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారలు చెబుతున్నారు. సికింద్రాబాదు, రామ్ నగర్, జియాగూడ, మోండా మార్కెట్ లో ఫిష్ విక్రయం కూడా భారీగానే జరిగాయని.. 2 వేల క్వింటాళ్ల వరకు అమ్ముడు పోయాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త సంవత్సరాలనికి వెల్ కమ్ చెబుతూ అర్థరాత్రి 12 గంటల వరకు పిల్లలు, పెద్దలు, యూత్, కుటుంబ సభ్యులు సెలబ్రెషన్స్ చేసుకున్నారు. ఇక నగరంలో హూటళ్లు, రిసార్ట్, క్లబ్లులు, పబ్‌లలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి