iDreamPost

19 ఏళ్ల అమ్మాయిపై హత్యాచారం! నిందితుడ్ని పట్టించిన చూయింగ్‌ గమ్‌!

  • Published Mar 25, 2024 | 2:17 PMUpdated Mar 25, 2024 | 2:17 PM

దాదాపు 44 ఏళ్ల కిందట ఓ విద్యార్థి పై అత్యాచారానికి పాల్పపడి, హత్య చేసిన మిస్టరీ వీడడంతో పాటు అసలు హంతకుడు ఎవరో తాజాగా పోలీసులు చేధించారు. అయితే అది కూడా ఒక చిన్న ఆధారంతో కేసును కొలిక్కించడం గమన్హారం.

దాదాపు 44 ఏళ్ల కిందట ఓ విద్యార్థి పై అత్యాచారానికి పాల్పపడి, హత్య చేసిన మిస్టరీ వీడడంతో పాటు అసలు హంతకుడు ఎవరో తాజాగా పోలీసులు చేధించారు. అయితే అది కూడా ఒక చిన్న ఆధారంతో కేసును కొలిక్కించడం గమన్హారం.

  • Published Mar 25, 2024 | 2:17 PMUpdated Mar 25, 2024 | 2:17 PM
19 ఏళ్ల అమ్మాయిపై హత్యాచారం! నిందితుడ్ని పట్టించిన చూయింగ్‌ గమ్‌!

సాధారణంగా ఎక్కడైనా హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఆ నేరాలకు పాల్పడిన హంతకులను పోలీసులు చాలా త్వరగా పట్టుకుంటారు. ఎందుకంటే.. ఆ నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఎక్కడో ఏదో ఒక ఆధారలను విడిచి వెళ్తుంటారు. అప్పుడు పోలీసులు సంబంధిత నమునాలను సేకరించి అసలు నిందుతుడి ఎవరనేది చాలా త్వరగా చేధిస్తారు. కానీ, కొన్ని కేసుల్లో మాత్రం కొంతమంది నేరస్థులను పట్టుకోవడం చాలా అలస్యం అవుతుంది. ఆ  అలస్యం కాస్త నెలలు, సంవత్సరాలు కావచ్చు. అయితే, దశాబ్దాల క్రితం జరిగిన నేరాల్లో హంతకులను పట్టుకోవడమంటే అది కలలో కూడా జరగని పని. కానీ, నాలుగు దశాబ్దాల కిందట జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు మిస్టరీని చేధించారు. ఆ హత్యకు సంబంధించిన హంతకుడిని పట్టుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దాదాపు 44 ఏళ్ల కిందట జరిగిన ఓ హత్య కేసు మిస్టరీ వీడడంతో పాటు అసలు హంతకుడు ఎవరో పోలీసులు చేధించారు. అయితే హంతకుడ్నీ ఓ చూయింగ్‌ గమ్‌లోని డీఎన్‌ఏ నమూనాలు ద్వారా పట్టించడం గమనార్హం. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అయితే ఈ ఆశ్చర్యకరమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఓరెగాన్‌లోని మౌంట్‌ హూడీ కమ్యూనిటీ కాలేజీకి చెందిన 19 ఏళ్ల బార్బారా టక్కర్ అనే విద్యార్థి 1980 సంవత్సరం జనవరి నెలలో హత్యాచారానికి గురయ్యింది. అయితే ఈ హత్యాచారానికి గురైన ముందు.. అనగా జనవరి 15న ఆ విద్యార్థి అపహరణకు గురైంది. ఆ తర్వాత ఆమె కాలేజీ క్యాంపస్‌ పార్కింగ్‌ సమీపంలో శవమై కనిపించింది. కాగా, ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టమార్టం జరిపించడంతో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చారు. అయితే ఈ పోస్టుమార్టం నేవిదికలో ఆమెపై అత్యాచారం చేసి అనంతరం దారణంగా హత్య చేసినట్లు వెల్లడయ్యింది.

అయితే, అప్పటిలో ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి రాబర్ట్‌ ప్లింప్టన్‌‌ గా పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలోనే అతడిపై పలు నేర ఆరోపణ చేసిన.. సరైన ఆధారాలు లభించకపోవడంతో ఆ కేసును చేధించలేకపోయారు. కానీ, 20 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇక శవపరీక్ష సమయంలో మృతురాలు బార్బారా నుంచి సేకరించిన నమూనాలను ఒరెగాన్‌ స్టేట్‌ పోలీస్‌ (OSP) క్రైమ్‌ ల్యాబ్‌కు పంపారు. అక్కడ నిపుణులు వాటిని విశ్లేషించి.. డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను రూపొందించారు. అనంతరం రాబర్ట్‌పైనా నిఘా కొనసాగించారు. ఈ క్రమంలోనే.. అతడు 2021లో చూయింగ్‌ గమ్‌‌ను నమలడాన్ని పోలీసులు గమనించారు.

ఇక దాన్ని సేకరించి ల్యాబ్‌ పరీక్షలకు పంపడంతో 2000లో రూపొందించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో ఇది సరిపోలింది. దీంతో హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. అదే ఏడాది జూన్‌ 8న రాబర్ట్ ప్లింప్టన్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. డిటెన్షన్‌ సెంటర్లో నిర్బంధించారు. ఇక విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇటీవల అతడిని దోషిగా నిర్దారించారు. కానీ, అతడు మాత్రం తాను నేరం చేయలేదని వాదిస్తున్నాడు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు అతడి తరఫు లాయర్లు పేర్కొన్నారు. దీంతో తుది తీర్పు జూన్‌లో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాబర్ట్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మరి, కేవలం ఒకక చూయింగ్ గమ్ నమునాతో 40 ఏళ్ల కేసును చేధించి హంతకుడిని అరెస్ట్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి