iDreamPost

ఓటిటి ఫ్యాన్స్ కి పండగే! రేపు ఒక్కరోజే 15 మూవీస్ రిలీజ్!

  • Author ajaykrishna Published - 06:02 PM, Thu - 6 July 23
  • Author ajaykrishna Published - 06:02 PM, Thu - 6 July 23
ఓటిటి ఫ్యాన్స్ కి పండగే! రేపు ఒక్కరోజే 15 మూవీస్ రిలీజ్!

ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం మారిపోయింది. మారింది అనడం కంటే.. మార్చుకున్నారు అంటే బెటర్ ఏమో! థియేటర్స్ కి వెళ్లే ఆలోచనలు సగం మానుకున్నారు. ఒకవేళ థియేటర్స్ లో ఆడినా.. ఆఖరికి సినిమాలన్నీ ఓటిటిలోకే కదా రావాలి అనే ధీమా కూడా కనిపిస్తుంది. అదీగాక థియేట్రికల్ మూవీస్, ఓటిటి మూవీస్ అని డివైడ్ చేయడం కూడా మొదలుపెట్టేశారు. కానీ.. ఎన్ని ఓటిటిలు వచ్చినా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏది ఇవ్వలేదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే.. వెండితెర కోసం తీసిన సినిమాలు ఆ స్క్రీన్ పై చూస్తూ.. ఆ సాంగ్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసే అవకాశం థియేటర్ లోనే దొరుకుతుంది.

అది వదిలేసి.. పాన్ ఇండియా సినిమాలు కూడా ఓటిటిలోకి ఎప్పుడు వస్తాయ్? అనే స్థాయిలో జనాలు ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. జనాలు ఓటిటిలకు ఎంతగా అడిక్ట్ అయిపోయారో! ఇంకా వీళ్లకు తగ్గట్టుగా పదుల సంఖ్యలో ఓటిటి ప్లాట్ ఫాములు పుట్టుకొచ్చేసాయి. ఆల్రెడీ ఉన్నటువంటి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్, ఆహా, సోనీలివ్.. ఇలాంటివి కాకుండా ప్రతీ భాషలో ఓటిటిలు వచ్చేసాయి. దీంతో థియేటర్ లలో చూడాల్సిన సినిమాలన్నీ ఓటిటిలలో చూసి చప్పట్లు కొడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ప్రతీ వీకెండ్ లాగే ఈ వీక్ కూడా చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. ఏకంగా శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అర్ధం చేసుకోండి.

మరి రేపు ఒక్కరోజే ఓటిటి రిలీజ్ అవుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

ఆహా:

  • మూను ముప్పతి మూను – తమిళం

అమెజాన్ ప్రైమ్:

  • స్వీట్ కారం కాఫీ – తెలుగు సిరీస్
  • ది హారర్ ఆఫ్ డోలోర్స్ రోచ్ -ఇంగ్లీష్
  • అదూరా – హిందీ

జీ5:

  • తర్లా – హిందీ
  • ఆర్చర్ గ్యాలరీ – బెంగాలీ

డిస్నీ హాట్ స్టార్:

  • ఐబి 71 – హిందీ
  • కిజాజి మోటో – ఇంగ్లీష్

నెట్ ఫ్లిక్స్:

  • ది పోప్స్ ఎక్జారిస్ట్స్ – ఇంగ్లీష్
  • హ్యాక్ మై హోమ్ – ఇంగ్లీష్
  • ది అవుట్ లాస్ – ఇంగ్లీష్
  • ఫెటల్ సెడక్షన్ – ఇంగ్లీష్
  • డీప్ ఫేక్ లవ్ (షో)

ప్రైమ్ షాట్స్:

  • అదూరా – హిందీ

సోనిలివ్:

  • ఫర్హానా – హిందీ/తెలుగు

జియో సినిమా:

  • బ్లైండ్ – హిందీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి