iDreamPost

Holidays: విద్యార్థులకు పండగలాంటి వార్త.. మార్చిలో మొత్తం 10 రోజులు సెలవులు

  • Published Mar 02, 2024 | 2:35 PMUpdated Mar 02, 2024 | 3:24 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసేలాంటి శుభవార్త. మార్చి నెలలో మొత్తం 11 రోజులు సెలవులు వచ్చాయి. ఎప్పుడెప్పుడంటే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసేలాంటి శుభవార్త. మార్చి నెలలో మొత్తం 11 రోజులు సెలవులు వచ్చాయి. ఎప్పుడెప్పుడంటే..

  • Published Mar 02, 2024 | 2:35 PMUpdated Mar 02, 2024 | 3:24 PM
Holidays: విద్యార్థులకు పండగలాంటి వార్త.. మార్చిలో మొత్తం 10 రోజులు సెలవులు

సెలవులంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. చదువుకునే వారికైనా.. ఉద్యోగాలు చేసే వారికైనా సరే.. ఒక్క రోజు సెలవు దొరకినా.. ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఉద్యోగస్తులు వీకెండ్‌ కోసం.. విద్యార్థులు సండే కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇవి కాక… ఇక మధ్యలో పండగల సందర్భంగా వచ్చే సెలవులు బోనస్‌ లాంటివి అన్నమాట. ఇక మార్చి నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు రానునున్నాయి. ఈ నెలలో ఏకంగా 10 రోజుల పాటు స్కూల్స్‌, కాలేజీలకు హాలీడే. మరి ఏ రోజు ఎందుకు సెలవు అంటే..

గత నెల అనగా ఫిబ్రవరిలో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు మాత్రమే మేడారం జాతర సందర్భంగా ఓ ఐదు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. మిగతా వారికి కేవలం ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే సెలవు లభించింది. ఇదిలా ఉంటే మార్చి నెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం కాకుండా.. మూడు పండగలు కూడా రావడంతో.. సెలవుల జాబితా పెరిగింది.

ముందుగా మార్చి 3 ఆదివారం. ఆ తర్వాత మార్చి 8 నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు. శుక్రవారం మార్చి 8న మహా శివరాత్రి, ఆ తర్వాత 9, 10 రెండో శనివారం, ఆదివారం వస్తున్నాయి. అలా రెండు వ్యారాల వ్యవధిలోనే 4 రోజుల సెలవులు రానున్నాయి. ఆ తరువాత మార్చి 17, 24 ఆదివారాలు రాగా మార్చి 25 సోమవారం హోలీ పండగ సందర్భంగా సెలవు. అలాగే మార్చి 29న గుడ్‌ ఫ్రైడే సందర్భంగా మరో రోజు సెలవు. ఇక మార్చిలో చివరి సెలవు.. 31నాడు. ఆరోజు ఆదివారం వచ్చింది. అలాగే బ్యాంకులకు నాలుగో శనివారం కూడా హాలీడేనే. ఇలా మొత్తంగా మార్చిలో 10 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్రాలను బట్టి ఈ హాలీడే వివరాలు మారుతుండవచ్చు.

ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రా‍ల్లో పరీక్షల సీజన్‌ నడుస్తోంది. ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక్క నిమిషం నింబంధనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో సడలింపు ఇస్తూ.. శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఒక్క నిమిషం నిబంధన వల్ల పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థి.. ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై ఎద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ప్రభుత్వం దిగి వచ్చి.. దీనిలో సడలింపు ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి