iDreamPost

త్వరలో మరో 10 వందే భారత్ రైళ్ల ప్రారంభానికి శ్రీకారం..!

దేశంలో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న వ్యవస్థల్లో ఒకటి రైల్వే. రోజూ లక్షలాది మంది ప్రజలు రైల్వేల గుండా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు రైల్వేలో కూడా వేగవంతం ప్రయాణం వచ్చేసింది. ఆ వేగానికి కారణమయ్యాయి వందే భారత్ రైళ్లు. ఇప్పటికే ఈ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి.

దేశంలో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న వ్యవస్థల్లో ఒకటి రైల్వే. రోజూ లక్షలాది మంది ప్రజలు రైల్వేల గుండా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు రైల్వేలో కూడా వేగవంతం ప్రయాణం వచ్చేసింది. ఆ వేగానికి కారణమయ్యాయి వందే భారత్ రైళ్లు. ఇప్పటికే ఈ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి.

త్వరలో మరో 10 వందే భారత్ రైళ్ల ప్రారంభానికి శ్రీకారం..!

‘బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి.. దీన్ని గానీ నమ్ముకుంటే అంతేనండి అంతేనండి’ జయం మూవీలో ఫేమస్ సాంగ్ ఉంది. గతంలో రైలు సమయానికి రాకపోవడం, క్రాసింగ్ అంటూ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, ఎప్పుడు మొదలౌతుందో, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుందో చెప్పడం కష్టంగా ఉండేది. ఆ నేపథ్యంలో రాసిన సాంగ్ అది. ఆ తర్వాత విమర్శలు రావడంతో లిరిక్స్ మార్చారనుకోండి అదే వేరో విషయం. అయితే ఇప్పుడు రైల్వే వ్యవస్థ అప్ గ్రేడ్ అయ్యింది. వేగంగా గమ్యస్థానాలకు చేర్చే రైళ్లను తీసుకువచ్చింది. అవే వందే భారత్ రైళ్లు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ రైళ్లకు దేశంలో మంచి ఆదరణ లభించింది.

కొన్ని గంటల్లోనే గమ్య స్థానాలకు చేర్చుతున్న వందే భారత్ రైళ్లకు గుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణీలకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లు తీసుకురాబోతుంది. 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనుంది కేంద్రం. ఇందులో హైదరాబాద్ నుండి మరో కొత్త రైలు నడవనుంది. సికింద్రాబాద్- పూణే వందే భారత్ రైలు ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందే భారత్ రైళ్లను నడుస్తున్నాయి. ఇది కూడా పట్టాలెక్కితే.. వాటి సంఖ్య 5కు చేరుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వీటికి బాగా ఆదరణ లభించడంతో.. వీటి సంఖ్య మరింత పెంచాలని చూస్తున్నారు రైల్వే అధికారులు.

vande bharat express

ఈ రైళ్లలో మిగిలిన ట్రైన్లలో లేని సదుపాయాలు ఉండటం, కొన్ని గంటల్లోనే గమ్య స్థానాలకు చేర్చడంతో ప్రయాణీకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. వీటిల్లో ప్రయాణించేందుకు మక్కువ చూపుతున్నారు ట్రావెలర్స్. ఇప్పటి వరకు దేశంలో 34 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాని మోడీ తర్వలో ఈ 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-పూణే, వారణాసి-లక్నో, పాట్నా-జల్పాయిగురి, మడ్గావ్-మంగళూరు, ఢిల్లీ-అమృత్ సర్, ఇండోర్-సూరత్, ముంబయి-కోల్హాపూర్, ముంబయి-జల్నా, పూణే-వడోదర, టాటానగర్-వారణాసి మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ పది రైళ్లతో కలిపితే మొత్తంగా దేశంలో నడుస్తున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 44కు చేరుకుంటుంది. ధర ఎక్కువైనా, వేగం కారణం వల్ల వీటిని ఆదరిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. మరీ ఈ రైళ్ల సంఖ్య పెరగడం వల్ల ప్రయాణీకులకు లాభమా, నష్టమా.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి