iDreamPost

ఝాన్సీ రిపోర్ట్

ఝాన్సీ రిపోర్ట్

అందం అభినయం రెండూ ఉన్నప్పటికీ కెరీర్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు విజయాలు లేక అప్పుడప్పుడు కనిపిస్తూ ఇటీవలే మాచర్ల నియోజకవర్గంలో ఐటెం సాంగ్ కూడా చేసిన అంజలి నటించిన వెబ్ సిరీస్ ఝాన్సీ. ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ల తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిన అంజలి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో తిరిగి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. తిరు దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ కం క్రైమ్ థ్రిల్లర్ మొత్తం ఆరు ఎపిసోడ్లతో వచ్చింది. చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ లాంటి తెలుసున్న క్యాస్టింగ్ ఇందులో ఉన్నారు. మరి ఝాన్సీ మెప్పించిందో లేదో చూద్దాం.

గతం మర్చిపోయిన ఝాన్సీ(అంజలి)అడవిలో తిరుగుతుండగా ఇంటికి తీసుకొస్తాడు సంకిత్(ఆదర్శ్ బాలకృష్ణ). ఆమెకు చికిత్స మొదలుపెడతాడు. అతని పాపతో ఝాన్సీకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మెల్లగా ఆమెకు కలలు రావడం, అందులో ఫ్లాష్ బ్యాక్ తాలూకు సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలవుతుంది.  ఝాన్సీని హత్య చేసేందుకు ప్రయత్నించిన మోడార్ (రుద్ర ప్రతాప్)లతో పాటు బార్బీ(చాందిని చౌదరి)కి సంబంధించిన కనెక్షన్ బయట పడుతుంది. ఇంతకీ ఈ యువతి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంది, ఈ వ్యూహం నుంచి ఎలా బయటపడిందనేది మొత్తం సిరీస్ చూశాకే పూర్తి క్లారిటీ వస్తుంది.

డైరెక్టర్ తిరు వర్తమానంలో ఉన్న చాలా ఇష్యూస్ ని తీసుకున్నాడు కానీ వాటిని సరైన రీతిలో ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలయ్యాడు. ఇలాంటి లైన్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటప్పుడు ప్రెజెంటేషన్ ఫ్రెష్ గా ఎంగేజింగ్ గా ఉండాలి. కానీ ఝాన్సీ గ్రాఫ్ ఒకసారి పైకి అయిదుసార్లు కిందకు పడిపోతూ అధిక శాతం బోర్ కొట్టిస్తుంది. నేకెడ్ వెపెన్ నుంచి స్ఫూర్తి తీసుకున్నప్పటికీ ఆ స్థాయిలో స్క్రీన్ ప్లే రాసుకోలేదు. పెర్ఫార్మన్స్ పరంగా అంజలి నిరాశను కలిగించే అవకాశం ఇవ్వలేదు. తనవరకు బెస్ట్ ఇచ్చింది. కాకపోతే పాత్రల తీరుతెన్నులు సరిగా రాసుకోలేదు. విపరీతమైన ఖాళీ టైం ఉంటే తప్ప ఝాన్సీని రికమండ్ చేయలేం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి