iDreamPost

అఫీషియల్: ప్రముఖ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత!

అఫీషియల్: ప్రముఖ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత!

క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ప్రముఖ క్రికెటర్ హీత్ స్ట్రీక్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వారం క్రితం హీత్ స్ట్రీక్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అదంతా అవాస్తవం హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారు అంటూ కుటుంబం క్లారిటీ ఇచ్చింది. కానీ, సరిగ్గా వారం తర్వాత హీత్ స్ట్రీక్ చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ వార్త కూడా పుకారు అయితే బాగుండు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. హీత్ స్ట్రీక్ జింబాబ్వే క్రికెటర్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అతనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. హీత్ స్ట్రీక్ ఇకలేరని తెలిసి క్రికెట్ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

జింబాబ్వే మాజీ కెప్టెన్, కోచ్ హీత్ స్ట్రీక్ క్యాన్సర్ తో పోరాడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కేవలం 49 సంవత్సరాల వయసులోనే హీత్ స్ట్రీక్ మరణించడంతో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆదివారం తెల్లవారుజామున హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన భార్య అధికారికంగా ప్రకటించారు. హీత్ స్ట్రీక్ ఎంతో గొప్ప ఆల్రౌండర్. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశారు. జింబాబ్వే క్రికెట్ కోసం హీత్ స్ట్రీక్ ఎంతో కృషి చేశారు. హీత్ స్ట్రీక్ ఒక గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. ఒక గొప్ప వ్యక్తి కూడా.

జింబాబ్వే ప్రజల అభ్యున్నతి కోసం హీత్ స్ట్రీక్ ఎంతగానో కృషి చేశారు. సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు చాలా గొప్ప అంశాలపై హీత్ స్ట్రీక్ పోరాడాడు. జింబాబ్వేలో హెచ్ఐవీ- ఎయిడ్స్ పై అవగాహన తీసుకురావడం, బాధితుల సహాయార్థం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఒక గొప్ప క్రికెటర్, ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ ని కోల్పోయాం అంటూ జింబాబ్వే ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హీత్ స్ట్రీక్ అభిమానులు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఆయన ఆత్మకు శాంచి చేకూరాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు. చాలా మంది ఈ వార్త కూడా పుకారు అని చెబితే ఎంతో బాగుంటుంది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి