iDreamPost

Yuvraj Singh: ఒంట్లో క్యాన్సర్.. ప్రాణాలు పోతాయని తెలిసినా.. దేశం కోసం ఆట ఆపలేదు!

  • Published Dec 12, 2023 | 11:04 AMUpdated Dec 12, 2023 | 1:18 PM

కేన్సర్‌తో బాధపడుతూ.. గ్రౌండ్‌లో రక్తం కక్కుకుంటూ టీమిండియా వరల్డ్‌ కప్‌ అందించిన వీరుడు యువరాజ్‌సింగ్‌. నేడు టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పుట్టిన రోజు. ఈ సంరద్భంగా.. యువీ పోరాటం గురించి తెలుసుకుందాం..

కేన్సర్‌తో బాధపడుతూ.. గ్రౌండ్‌లో రక్తం కక్కుకుంటూ టీమిండియా వరల్డ్‌ కప్‌ అందించిన వీరుడు యువరాజ్‌సింగ్‌. నేడు టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ పుట్టిన రోజు. ఈ సంరద్భంగా.. యువీ పోరాటం గురించి తెలుసుకుందాం..

  • Published Dec 12, 2023 | 11:04 AMUpdated Dec 12, 2023 | 1:18 PM
Yuvraj Singh: ఒంట్లో క్యాన్సర్.. ప్రాణాలు పోతాయని తెలిసినా.. దేశం కోసం ఆట ఆపలేదు!

2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో క్రికెట్‌ అభిమానులు ఎంతో బాధపడ్డారు. 2011 మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందేమో అని ఆశపడ్డ వారికి నిరాశే మిగిలింది. 2011లో కంటే కూడా టీమ్‌ ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నా.. ఎందుకు రోహిత్‌ సేన కప్‌ గెలవలేకపోయింది అంటే.. చాలా మంది చెప్పే సమాధానం యువరాజ్‌ సింగ్‌ లేకపోవడం. యువీ లాంటి ఆల్‌రౌండర్‌ టీమ్‌లో లేకపోవడంతోనే ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓడిపోయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు వరల్డ్‌ కప్‌ గెలవాలంటే.. బాగా ఆడితే సరిపోదని, ఒక కసితో ఆడాలని అంటున్నారు. మరి యువరాజ్‌ సింగ్‌ అంత కసిగా ఆడాడా? అని కొంత మందికి డౌట్‌ రావచ్చు.. యువీ కసితో మాత్రమే కాదు.. తన ప్రాణాలనే పణంగా పెట్టి మరీ భారత్‌కు వరల్డ్‌ కప్‌ అందించాడు. ఆ వీరుడి పోరాటం గురించి చెప్పాలంటే.. మాటలు సరిపోవు. దేశానికి వరల్డ్‌ కప్‌ అందించడం కోసం గ్రౌండ్‌లో రక్తం కక్కుకుంటూ ఆడిన చరిత్ర అతనిది. నేడు యువీ పుట్టిన రోజు సందర్భంగా.. 2011 వరల్డ్‌ కప్‌ సందర్భంగా టీమిండియాలో యువీ ఎలాంటి పాత్ర పోషించాడో ఇప్పుడు తెలుసుకుందాం..

28 ఏళ్ల తర్వాత టీమిండియా మళ్లీ వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు ఎప్పుడో 1983లో ఇండియా వరల్డ్‌ కప్‌ నెగ్గింది. మళ్లీ అన్నేళ్ల తర్వాత టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటాయి. కొన్ని వారాలపాటు దేశం మొత్తం ఆ విజయం తాలూకు ఆనందాన్ని ఆస్వాదించింది. దేశానికి వరల్డ్ కప్‌ అందించాడని టీమిండియా కెప్టెన్‌ ధోనిని ఆకాశానికి ఎత్తేశారు. సచిన్‌ జన్మ సార్థకమైందని.. క్రికెట్‌ దేవుడిని భుజాలపై మోశారు. విజయం తర్వాత వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌ ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి మధుర క్షణాలు ఆస్వాదిస్తున్న సమయంలోనే ప్లేయర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ కప్‌ టోర్నీగా నిలిచిన యువరాజ్‌ సింగ్‌ మాత్రం క్యేన్సర్‌ బారిన పడ్డాడు. ఈ వార్తతో క్రికెట్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా ఆడి, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు గెలిచిన వ్యక్తికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రికెట్‌ ప్రపంచ మొత్తం షాక్‌లో ఉంటే.. యువీ మాత్రం చిరునవ్వులు చిందించాడు. ఎందుకంటే తనకు క్యేన్స్‌ర్‌ అని వైద్యులు ఇప్పుడు ప్రపంచానికి చెప్పారు. కానీ యువీకి ఆ విషయం వరల్డ్‌ కప్‌ ఆడుతున్నప్పుడే తెలుసు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2011లో భాగంగా గ్రూప్‌ స్టేజ్‌లో వెస్టిండీస్‌తో చెన్నైలో టీమిండియా మ్యాచ్‌. కెప్టెన్‌ ధోని టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌కు గాయం కారణంగా.. సచిన్‌ టెండూల్కర్‌తో గౌతమ్‌ గంభీర్‌ ఓపెనర్‌గా వచ్చాడు. కానీ.. ఇద్దరు త్వరగానే పెవిలియన్‌ చేరారు. టీమిండియా 52 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత యువ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో పాటు సీనియర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌పై పడింది. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఇద్దరూ ఆడుతూ.. 100 పరుగుల భాగస్వామ్య నమోదు చేశారు. ఇంతలోనే కొండలాంటి మనిషి యువీ కూలిపోయినట్లు కూర్చున్నాడు. నోట్లో నుంచి రక్తం.. అంతే ఒక్కసారిగా అంతా షాక్‌. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఫస్ట్‌ఎయిడ్‌ తీసుకోవాల్సిందిగా ఫీల్డ్‌ అంపైర్‌ యువీని కోరతాడు. కానీ.. యువీ మాత్రం అంపైర్‌ సూచనను లెక్కచేయలేదు. ఎందుకంటే.. ఆ సమయంలో తనకు రక్తం కనిపించడం లేదు. తన లక్ష్యం ఒక్కటే ఇండియాకు వరల్డ్‌ కప్‌ అందించాలి, సచిన్‌కు అంకితం ఇవ్వాలి. ఇది మాత్రమే యువీకి కనిపిస్తుంది. దాని కోసం రక్తం కక్కినా బెదరలేదు. రక్తం కక్కుకుంటూనే సెంచరీతో టీమిండియాను గెలిపించాడు.

ఆ తర్వాత కీలకమైన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో పోరులో కూడా యువీ తన విశ్వరూపం చూపించాడు. హాఫ్‌ సెంచరీతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను ఫైనల్‌ చేర్చాడు. ఆ విజయం తర్వాత యువరాజ్‌ మోకాళ్లపై కూర్చోని చేసిన సింహాగర్జన ప్రతి భారతీయ క్రికెట్‌ అభిమాని గుండెల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఫైనల్లో అందరూ ధోని కొట్టిన చివరి సిక్స్‌ గురించి మాట్లాడుకుంటారు. కానీ.. ఫైనల్లో యువీ కూడా 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అసలు టీమిండియా 2011లో వరల్డ్‌ కప్‌ గెలిచిందంటే ప్రధాన కారణం యువీనే. ప్రతి మ్యాచ్‌లో రాణించాడు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా.. ప్రాణాంతకమైన క్యాన్సర్‌ తనను లోలోప తినేస్తుందని తెలిసినా.. యువీ చూపించిన పోరాటంతోనే టీమిండియాకు వరల్డ్‌ కప్‌ దక్కింది. బ్యాటింగ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ యువీ వరల్డ్‌ కప్‌ అదరగొట్టాడు.

దేశం కోసం వరల్డ్‌ కప్‌ గెలవాలనే కసి యువరాజ్‌ను తన ప్రాణాలను సైతం లెక్కచేయనిలేదు. అది ఒక వీరుడికి ఉండే లక్షణం. ప్రాణం పోతున్నా.. రక్తం ధారలై పారుతున్నా.. గెలుపే లక్ష్యంగా సాగడం గొప్ప విషయమే కాదు.. అంతకు మించి. అలాంటి తెగువను, పోరాటాన్ని యువరాజ్‌ చూపించాడు కనుకే భారత్‌కు 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ దక్కింది. తనకు కాకుండా తన కన్న జూనియర్‌ ధోనికి కెప్టెన్సీ ఇచ్చారనే విషయాన్ని సైతం మర్చిపోయి దేశం కోసం, తన టీమ్‌ కోసం, తన ఆరాధ్య క్రికెట్‌ దైవం సచిన్‌ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడాడు. అయినా.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆడే వ్యక్తికి కెప్టెన్సీ ఉంటే ఎంత లేకుంటే ఎంత. బహుబలిలో కిరీటం ఉన్నా.. భళ్లాలదేవ రాజు కాలేకపోయాడు. కానీ.. బహుబలి కిరీటం లేకపోయినా ప్రజలకు రాజయ్యాడు. అలానే యువీ టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించిన ఒక ట్రూ ఛాంపియన్‌. మరి యువరాజ్‌ చూపించిన పోరాట పటిమపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి