iDreamPost

వచ్చే ఏపీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ సునామీ! తేల్చిన సర్వే

YS Jagan: ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ప్రీపోల్ సర్వేలు నిర్వహించాయి. తాజాగా మరో సర్వే సంస్థ కూడా ప్రీ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో మళ్లీ జగనే సీఎం అని తేల్చింది.

YS Jagan: ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ప్రీపోల్ సర్వేలు నిర్వహించాయి. తాజాగా మరో సర్వే సంస్థ కూడా ప్రీ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో మళ్లీ జగనే సీఎం అని తేల్చింది.

వచ్చే ఏపీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ సునామీ! తేల్చిన సర్వే

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ  పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి.. సిద్ధం పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తూ ఎన్నికల రణభేరిని మోగించింది. మరోవైపు టీడీపీ,జనసేనా పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కూటమిగా వెళ్తొన్నాయి. టీడీపీ అయితే రా..కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను చేసేతున్నారు. ఇదే సమయంలో ఈ కూటమిలో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. అధికార ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణభేరీని మోగించింది. ఇలాంటి సమయంలో ఏపీలో ఏ పార్టీ  అధికారంలోకి వస్తుందా అనే ఆసక్తి  అందరిలో నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఓ సర్వే సంస్థ ఏపీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలను వెల్లడించింది.

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒక్కటి ఒకవైపు.. మిగతా పార్టీలన్ని ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తోంది.  వచ్చే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.. ఎంత శాతం ఓట్లు రాబడుతుంది.. ఏపీకి కాబోయే సీఎం ఎవరు అనే అంశాల మీద ఇప్పటికే అనేక సర్వేలు వెలువడ్డాయి. అన్ని సర్వేలు దాదాపు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మొగ్గు చూపాయి. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ  ఎలెక్ సెన్స్ కూడా ప్రీ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

again ap am jagan

ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాలతో వైసీపీ విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. టీడీపీ, జనసేన కూటమి 53 సీట్లకే పరిమితమౌతాయని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ కనీసం తమ ఖాతాను కూడా తెరవలేవని స్పష్టం చేసింది ఎలెక్‌సెన్స్ సర్వే రిపోర్ట్. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 జనవరి 1 వరకు నిర్వహించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో  88,7000 శాంపిల్ తీసుకున్నారు. ఇవన్ని నేరుగా ఓటర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాక ఈ ప్రీ పోల్ సర్వేలో టీడీపీ, జనసేన కలిసి పోటీనే పరిగణలోకి తీసుకుంది.

ఇక ఎలెక్ సెన్స్ సర్వే ప్రకారం.. వైఎస్సార్ సీపీకి 122 +/- 10 స్థానాల్లో విజయం సాధిస్తుంది. అలానే 49.14 శాతం ఓట్లను సాధిస్తుంది. ఇక  టీడీపీ, జనసేన కూటమికి 53+/-10 స్థానాలు గెల్చుకుంటుంది. అదే విధంగా ఓటింగ్ శాతం 44.34 వస్తుంది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇతరులకు ఒక్కస్థానం కూడా లభించదని ఈ సర్వే తేల్చింది. బీజేపీకి 0.56 శాతం, కాంగ్రెస్ కి 1.21 శాతం, ఇతరులకు 4.75 శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే వెల్లడించింది. సీఎం జగన్ పరిపాలనపై 53.7 శాతం మంది సంతృప్తిని వ్యక్తం పరిచారు. 6.3 శాతం మంది ఫర్వాలేదని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనను మెచ్చుకున్న వారిలో మగవారి కంటే మహిళలే అధికంగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది.

ఇక ఈ సర్వే ప్రకారం జిల్లాల వారిగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో ఇప్పుడు తెసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 7 స్థానాలు, టీడీపీ-జనసేన కూటమి 2 స్థానాలు, గట్టి పోటీ 1 స్థానాంలో జరుగుతుంది. అలానే విజయనగరం జిల్లాలో వైసీపీ 8 స్థానాలు దక్కగా, గట్టి పోటీ 1 స్థానంలో జరుగుతుంది. విశాఖపట్నంలో మొత్తం 15 స్థానాలు ఉండగా.. వైసీపీ 4, టీడీపీ-జనసేన కూటమి 10 స్థానాలసు దక్కుతాయి. అదే విధంగా 1 స్థానంలో గట్టి పోటీ ఉంటుంది. తూర్పు గోదావిరి జిల్లాలో  వైసీపీకి 7 స్థానాలు, టీడీపీ-జనసేన కూటమికి 9 స్థానాలు దక్కుతాయి. అలానే 3 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీ 8 స్థానాలు, టీడీపీ-జనసేన కూటమికి 3 స్థానాలు, 4 స్థానాల్లో పోటీ గట్టిగా ఉంటుంది.

ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ 9 స్థానాలను గెల్చుకోగా, టీడీపీ- జనసేనకు 5 స్థానాలు మాత్రమే దక్కుతాయి. రెండు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ 11 స్థానాలు, టీడీపీ 3 స్థానాలు, మరో 3 చోట్ల గట్టి పోటీ ఉంటుంది. ఇక ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీకి 8, టీడీపీ-జనసేన కూటమికి 2 స్థానాలు, మరో 2 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే.. మొత్తం 10 స్థానాలకు గాను వైసీపీ 9, టీడీపీ-జనసేన కూటమి 1 స్థానం లభిస్తుంది. చిత్తూరు జిల్లా వైసీపీ 12 స్థానాలు, టీడీపీ- జనసేన కూటమికి 2 స్థానాలు గెల్చుకుంటాయి. కడప జిల్లాలోని మొత్తం 10 స్థానాలు వైఎస్సార్ సీపీ ఖాతాలోకే వెళ్తాయి.

కర్నూలు జిల్లాలో మొత్తం 14 స్థానాలకు గాను వైసీపీ 12,  టీడీపీ, జనసేన కూటమి 2 స్థానాలు గెల్చుకుంటాయి. అనంతపురం జిల్లాలో 8 స్థానాలు వైసీపీకి, 2 స్థానాలు టీడీపీ దక్కగా..మరో 4 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. ఓవరాల్ గా ఏపీ మొత్తంలో 175 స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ 113 , టీడీపీ, జనసేన కూటమి 39 స్థానాలు గెల్చుకోగా, 23 స్థానాల్లో గట్టి పోటీ ఉండనున్నట్లు ఈ సర్వే తేల్చింది. మొత్తంగా ఎలెక్ సెన్స్ పోల్స్ సర్వే ప్రకారం.. ఏపీలో మరోసారి వైఎస్సార్ సీపీదే అధికారంమని తేల్చింది. అంటే మరోసారి  జగన్ మోహన్ రెడ్డి సీఎం కానున్నారు. మొత్తంగా జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ ఎలెక్ సెన్స్ సర్వే.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి.. తాజాగా వెల్లడైన ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి