iDreamPost

పేదల జీవితాల్లో వెలుగుల కోసమే జగనన్న ‘జీవ కాంత్రి’ : సీఎం వైఎస్‌ జగన్‌

పేదల జీవితాల్లో వెలుగుల కోసమే జగనన్న ‘జీవ కాంత్రి’ : సీఎం వైఎస్‌ జగన్‌

రైతు, రైతాంగం బాగుంటనే రాష్ట్రం బాగుంటుంది, ఇళ్లాలు బాగుంటేనే ఇళ్లు బాగుంటుందనే ఉద్దేశంతో జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభిస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. వర్చువల్‌ విధానంలో జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌.. అనంతరం పథకం లక్ష్యాలు, అమలు తీరును వివరించారు.

‘‘ వ్యవసాయంతోపాటు పశుపోషణ ఉంటేనే గ్రామాలు బాగుంటాయి. వ్యవసాయేతర ఆదాయం వస్తేనే కరువును సమర్థవంతంగా ఎదుర్కొనగలం. పశుపోషన ద్వారా సుస్థిర జీవనోపాధి లభిస్తుంది. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా లబ్ధిదారులైన అక్కచెళ్లెమ్మలకు వారం రోజుల క్రితం 4.69 లక్షల గేదెలు, ఆవుల పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించాం. ఈ రోజు 2.49 లక్షల యూనిట్ల మేకలు, గొర్రెలు పంపిణీ పథకం ప్రారంభిస్తున్నాం. మూడు దశల్లో 2022 డిసెంబర్‌ నాటికి వీటì ని పంపిణీ చేస్తాం.

ఒక యూనిట్‌లో 15 మేకలు లేదా గొర్రెలు ఉంటాయి. ఇందులో 14 మేకలు/ గొర్రెలు, ఒక పొట్టేలు/మేకపోతు ఉంటాయి. 2.49 లక్షల యూనిట్లు అంటే.. దాదాపు 40 లక్షల మేకలు/ గొర్రెలు. ఇవన్నీ ఒకసారి పంపిణీ సాధ్యం కాదు కాబట్టి.. మూడు దశల్లో లబ్ధిదారులకు అందిస్తాం. 2.49 లక్షల యూనిట్ల కోసం 1869 కోట్లు వెచ్చిస్తున్నాం. ఇందులో 1.51 లక్షల యూనిట్లు మేకలు, మిగతావి గొర్రెలు ఉంటాయి. మొదటి దశలో 2021 మార్చిలోగా 20 వేల యూనిట్లు ఇస్తాం. 2022 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ లోపు మిగతా 99 వేల యూనిట్లు పంపిణీ చేస్తాం.

ఆర్‌బీకేలు వ్యవసాయమే కాకుండా.. పశుపోషణ పై కూడా సేవలు అందిస్తాయి. పశువులకు సంబంధించి వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ, పశుఆరోగ్య కార్డుల జారీ, దాణా అందుబాటులో ఉంచుతారు. వైఎస్సార్‌ సన్నజీవుల నష్ట పరిహార పథకం ఆర్‌బీకేల ద్వారా అందిస్తాం. పశుకిసాన్‌ క్రెడిట్‌ కార్డులు కూడా జారీ చేస్తాం.

గొర్రెలు, మేకలు కొనుగోలులో లబ్ధిదారులకు సహాయం చేసేందుకు మండల స్థాయి కొనుగోలు కమిటీలు ఏర్పాటు చేశాం. ఇందులో పశువైద్యులు, బ్యాంకు ప్రతినిధులు, సెర్ఫ్‌ ప్రతినిధులు ఉంటారు. ఈ కమిటీలు అడుగడుగునా లబ్ధిదారులకు అండదండలు ఇస్తారు. నచ్చిన చోట, నచ్చిన ధరకు కొనుగోలు చేసే స్వేచ్ఛ లబ్ధిదారులకు ఇస్తున్నాం. ఆరోగ్యవంతమైన జీవాల కొనుగోలుకు కమిటీలు సహకరిస్తాయి. లేదా కమిటీలే కొనుగోలు చేసి ఇవ్వాలని కోరినా చేస్తారు.

లబ్ధిదారులకు ఆధునిక పోషణ, యాజమన్యా పద్ధతులపై శిక్షణ ఇస్తాం. కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో రెండు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పెంచిన గొర్రెలు, మేకలు అమ్ముకునేందుకు మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తాం. అలానా గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఈ సంస్థకే కాదు.. ఎక్కువ ధర ఎక్కడ వస్తే అక్కడ అమ్మకొవచ్చు. అలానా గ్రూప్‌ తూర్పుగోదావరి, కర్నూలులో మాంసం ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మంచి రేటు రావడానికి ఈ చర్యలు చేపట్టాం.

వైఎసాసర్‌ చేయూత, ఆసారా పథకాల ద్వారా మహిళలు తమ జీవనోపాధికి ఏమి చేయాలనుకుంటారో గ్రామ సచివాయలయాల్లో తెలపండి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తాం. పెద్ద కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాం. గడచిన 18 నెలల పాలనలో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు పథకాలు ప్రవేశపెట్టాం, చట్టాలు చేశాం. విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామ’’ని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి