iDreamPost

తెలంగాణ సరస్వతీ పుత్రుడు.. 4 ఏళ్లలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు..

తెలంగాణ సరస్వతీ పుత్రుడు.. 4 ఏళ్లలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు..

పట్టుదలతో కృషి చేస్తే విజయం నీ బానిసవుతుందని పెద్దలు అంటుంటారు. అవును.. కొలువు సాధిచండం గగనంగా భావించే వారు కొందరు అయితే.. రేయింబవళ్లు శ్రమించి… విజయాలను తనకు బానిసగా చేసుకునే వారు మరికొందరు ఉంటారు. ఆ కోవకు చెందిన ఓ యువకుడు ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు. అయితే ఆ ఉద్యోగాలతో సంతృప్తి చెందలేదు.గ్రూప్‌ 1 కొట్టడమే తన లక్ష్యమని తెలిపాడు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కచ్చితంగా గ్రూప్‌-1 అధికారిగా ఎదికేగేందుకు కృషి చేస్తానంటున్నాడు. మరి.. ఆ వీరుడు ఎవరో, ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం గోలేటి సిరికొండ అజయ్ చారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అతడి తల్లిదండ్రులు సిరికొండ రామయ్య, రమాదేవి. అజయ్ తండ్రి కులవృత్తి చేస్తున్నాడు. ఇక అజయ్.. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే  కోరిక ఉండేది. కేవలం కోరికలు ఉంటే సరిపోదని భావించి.. అందుకు తగ్గట్లు శ్రమించాడు. అజయ్.. పదోతరగతి వరకు సొంత ఊర్లోనే చదువుకుని ఇంటర్ కు హుజూరాబాద్ కు వెళ్లాడు. ఆ తరువాత డిగ్రీ హైదరాబాద్ లో చదివాడు.

  అనంతరం 2019లో పంచాయతీ కార్యదర్శి పరీక్షల కోసం సిద్ధమయ్యాడు. అందులో విజయం సాధించి జైనూర్‌ మండలంలో జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వర్తించాడు. ఇదే సమంయలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నించి.. అక్కడ విజయం సాధించారు. అలానే ఇటీవల జరిగిన ఎస్సై పరీక్షల్లో డిప్యూటీ జైలర్ ఎంపిక అయ్యాడు. తన ఇద్దరి మేనమామలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ మూడు ఉద్యోగాలను సాధించాడు.

కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఎస్సై పరీక్షల కోసం సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో డిప్యూటీ జైలర్‌గా ఎంపికయ్యాడు. దీంతో 4 ఏళ్లో 3 ఉద్యోగాలు సాధించిన వ్యక్తిగా నిలిచాడు. ఈ విజయాలు తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అజయ్ చెబుతున్నారు. ఉద్యోగ సాధనలో ప్రశ్నపత్రం విధానంపై పూర్తి అవగాహన అవసరమని అజయ్‌ చారి చెబుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలో ఎస్సై గా పనిచేస్తున్న  తన మేనమామ శేఖర్‌ చారి కారణమంట. భవిష్యత్‌లో గ్రూప్‌-1 సాధించడమే లక్ష్యమని తెలిపాడు. భవిష్యత్‌లో అతను మరింత ముందుకెళ్లాలని ఆశిద్దాం. మరి.. సరస్వతి పుత్రుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నిమిదిన్నర ఏళ్ల బాలుడు! అసలు స్టోరీ ఏంటంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి