iDreamPost

స్థానిక సంస్థలపై సాధారణ ఎన్నికల ఎఫెక్ట్‌..

స్థానిక సంస్థలపై సాధారణ ఎన్నికల ఎఫెక్ట్‌..

సాధారణ ఎన్నికల ఫలితాల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. టీడీపీ ఘోర పరాజయం పాలైంది. కడప, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో టీడీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరులో ఆయన తప్పా టీడీపీ అభ్యర్థి ఒక్కరూ గెలవలేదు. 14 స్థానాలకు గాను వైసీపీ 13 స్థానాల్లో జెండా ఎగురవేసింది.

సాధారణ ఎన్నికల ముగిసి 9 నెలలవుతోంది. నాటి ఫలితాలు, ఓటర్ల నాడిని గుర్తెరిగిన టీడీపీ నేతలు పలు స్థానాల్లో పోటీ చేసేందుకు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నిన్న శనివారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా.. 9696 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ 2,129 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. 652 జడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను అధికార పార్టీ అభ్యర్థులకు ఎవరూ పోటీ లేరు.

అధికార పార్టీయే కాదు టీడీపీ కూడా ఏకగ్రీవంగా ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 92 ఎంపీటీసీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది.

125 జడ్పీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో.. పలు జిల్లాలో జడ్పీ పీఠం వైసీపీకే ఖరారైంది. కడపలో 50 స్థానాలకు గాను 38 స్థానాలు ఏకగ్రీవమవడంతో వైసీపీ అభ్యర్థి చైర్మన్‌ పీఠంపై కూర్చోవడం లాంఛనమైంది. చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీలకు గాను 29 స్థానాలు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ జడ్పీ పీఠం కూడా అధికార పార్టీ వశమైనట్లే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి