iDreamPost

యాత్ర 2 డిలీటెడ్ సీన్.. వైరల్ అవుతున్న వీడియో..

Yatra 2 Deleted Scene: యాత్ర 2 సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మూవీ డిలీటెడ్ సీన్ వైరల్ అవుతోంది.

Yatra 2 Deleted Scene: యాత్ర 2 సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మూవీ డిలీటెడ్ సీన్ వైరల్ అవుతోంది.

యాత్ర 2 డిలీటెడ్ సీన్.. వైరల్ అవుతున్న వీడియో..

యాత్ర 2 సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. థియేటర్లలో సందడి నెలకొంది. గతంలో ఎలాగైతే యాత్ర సినిమా సక్సెస్ అయ్యిందో.. అదే స్థాయిలో యాత్ర 2 సినిమాకి కూడా ఆడియన్స్ నుంచి అప్లాజ్ లభిస్తోంది. మహి వీ రాఘవ్ సినిమాని తెరకెక్కించిన తీరుకు అభిమానులు మెస్మరైజ్ అయిపోతున్నారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ ప్రశంసిస్తున్నారు. జగన్ ఎదిగిన తీరును స్పష్టంగా చూపించారంటున్నారు. ఇప్పుడు యాత్ర 2 సినిమా నుంచి డిలీటెడ్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సినిమాలో ఒకరిని హీరోని చేయాలంటే మరొకరిని విలన్స్ గా చూపించాల్సిన అవసరం లేదంటూ చెప్పిన డైరెక్టర్ మాటలను సినిమాలో నిజంగానే నిజం చేసి చూపించారు. ఎక్కడా ఎవరినీ తులనాడకుండా, ఎవరినీ డీ గ్రేడ్ చేయకుండా ఆయన సినిమాని తెరకెక్కించిన విధానానికి మంచి మార్కులే పడుతున్నాయి. ఈ సినిమాలో నోటబుల్ సీన్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలానే ఉన్నాయి. చాలా డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన డిలీటెడ్ సీన్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ సీన్ ఏంటంటే.. తండ్రి పోయిన బాధలో జగన్ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ అప్పటి పరిస్థితులను తమ ఇంట్లో కూర్చుని బేరీజు వేసుకుంటూ ఉంటారు. ప్రతిపక్ష నేతకు సొంతపార్టీ నేతలు అసలు విషయాన్ని వెల్లడిస్తారు. ఇప్పటి సింపథీ చూస్తుంటే తర్వాతి సీఎం జగనే అంటున్నారు అంటూ విషయాన్ని చేరవేస్తాడు. 150 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా సంతకాలు చేసి ఢిల్లీకి లెటర్ కూడా పంపారంటూ చెప్తాడు.

ఇంకేముందు ఆ నేత తన బుర్రకు పదును పెట్టి.. “తండ్రి పోయాడనుకుంటే కొడుక్కొచ్చాడు. తండ్రి చావే వాడి రాజకీయ బలమైతే.. దాన్నే వాడి బలహీనతగా మార్చండి. తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి.. శవ రాజకీయాలు చేస్తున్నాడని నమ్మించండి” అంటూ హుకుం జారీ చేస్తారు. అప్పుడు సొంత నేతలకే ఒక ధర్మ సందేహం వస్తుంది. మరి.. జనాలు నమ్ముతారా సార్ అంటూ మనసులో ఉన్నది అడిగేస్తారు. “ఒక అబద్ధాన్ని వార్త చేసి.. ఆ వార్తని వందసార్లు చెప్పిందే చెప్పి ఇది నిజం అని నమ్మించడానికి మన టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా. బురద జల్లడమే మన పని. అది తుడుచుకుంటాడో.. కడుక్కుంటాడో వాడి పని” అంటూ చెప్పుకొస్తాడు. ఈ సీన్ ని మూవీ నుంచి ఎందుకు తీసేశారు అనే ప్రశ్న అందరూ అడుగుతున్నారు. అందుకు సమాధానం డైరెక్టర్ గతంలోనే చెప్పేశాడు. ఇంకొకరిని విలన్ చేయాలి అనుకోవడం లేదు అని. అందుకే షూట్ చేసినా కూడా ఈ సీన్ ని డిలీట్ చేసి ఉండచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి.. ఈ డిలీటెడ్ సీన్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి