iDreamPost

Yashasvi Jaiswal: రికార్డులు బద్దలు కొడుతున్న జైస్వాల్.. తాజాగా మరోటి! ఏకంగా..

డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు యశస్వీ జైస్వాల్. ఇప్పటికే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్న ఈ యువ కెరటం.. తాజాగా మరో నయా రికార్డును చేరుకున్నాడు.

డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు యశస్వీ జైస్వాల్. ఇప్పటికే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్న ఈ యువ కెరటం.. తాజాగా మరో నయా రికార్డును చేరుకున్నాడు.

Yashasvi Jaiswal: రికార్డులు బద్దలు కొడుతున్న జైస్వాల్.. తాజాగా మరోటి! ఏకంగా..

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్  ద్విశతకంతో కదంతొక్కాడు. ఓవైపు వికెట్లు పడుతున్నాగానీ.. పట్టువదలని విక్రమార్కుడిలా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ వైపు దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. ఈ డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటికే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్న ఈ యువ కెరటం.. తాజాగా మరో నయా రికార్డును చేరుకున్నాడు. ఈ క్రమంలోనే మూడో ఇండియన్ బ్యాటర్ గా చరిత్రకెక్కాడు.

యశస్వీ జైస్వాల్.. ఇంగ్లాండ్ పాలిట సింహస్వప్నంలా మారాడు. ఎటాకింగ్ ఆటతో ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తొలిరోజు 179 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ యువ బ్యాటర్ రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే తన కెరీర్ లో తొలి ద్విశతకం సాధించాడు. 277 బంతుల్లో ఈ మైల్ స్టోన్ ను చేరుకున్నాడు. సిక్స్ తో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. డబుల్ సెంచరీని సైతం ఫోర్, సిక్స్ తో పూర్తి చేయడం విశేషం. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ డబుల్ సెంచరీ ద్వారా అతిపిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. 22 సంవత్సరాల 77 రోజుల జైస్వాల్ ఈ ఘనత సాధించి, ఇద్దరు దిగ్గజాల తర్వాత నిలిచాడు. ఈ లిస్ట్ లో టీమిండియా దిగ్గజ బ్యాటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

yashasvi jaiswal create record

వినోద్ కాంబ్లి 1993లో ఇంగ్లాండ్ పై వాంఖడేలో జరిగిన టెస్ట్ లో డబుల్ సెంచరీ సాధించాడు. అప్పుడు అతడి ఏజ్ 21 సంవత్సరాల 32 రోజులు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 21 సంత్సరాల 277 రోజులకు డబుల్ సెంచరీ చేసి రెండో భారత బ్యాటర్ గా నిలిచాడు. తాజాగా ఇంగ్లాండ్ పై ద్విశతకం బాదిన యశస్వీ మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా.. ఓవరాల్ గా ఈ రికార్డు లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు పాకిస్తాన్ దిగ్గజ ప్లేయర్ జావేద్ మియాందాద్. అతడు కేవలం 19 ఏళ్ల 140 రోజులకే ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ, రోహిత్ సాధించనివి కూడా జైస్వాల్ సాధించాడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 391 పరుగులు చేసింది. క్రీజ్ లో కుల్దీప్ యాదవ్(7), బుమ్రా(2) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. డబుల్ సెంచరీ హీరో జైస్వాల్ 209 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మరి రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్న యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: టీమిండియా ప్లేయర్ల పేరిట ఓ చెత్త రికార్డు! టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి