iDreamPost

వీడియో: సచిన్‌ స్థాయినే కాదు.. బాధను కూడా చవిచూసిన కోహ్లీ!

  • Author singhj Published - 03:19 PM, Mon - 20 November 23

క్రేజ్, ఫేమ్, పాపులారిటీ విషయంలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ స్థాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఒకప్పుడు సచిన్ పడిన బాధను అతడు కూడా చవిచూడక తప్పలేదు.

క్రేజ్, ఫేమ్, పాపులారిటీ విషయంలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ స్థాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఒకప్పుడు సచిన్ పడిన బాధను అతడు కూడా చవిచూడక తప్పలేదు.

  • Author singhj Published - 03:19 PM, Mon - 20 November 23
వీడియో: సచిన్‌ స్థాయినే కాదు.. బాధను కూడా చవిచూసిన కోహ్లీ!

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ.. ఈ పేర్లు తెలియని క్రికెట్ లవర్స్ ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఒకరు తన గేమ్ ద్వారా జెంటిల్మన్ గేమ్​కు వన్నె తెచ్చారు. మరొకరు తన ఆటతీరుతో క్రికెట్​కు వరల్డ్ వైడ్​గా క్రేజ్ పెరిగేలా చేశారు. ఎందరో వందలాది మంది యువకులు ఈ ఆటను తమ కెరీర్లుగా మలచుకోవడానికి సచిన్ కారకుడయ్యాడు. క్రికెట్​ను ఒలింపిక్స్​లో చేర్చడంలో కొన్ని ప్రధాన కారణాల్లో ఒకటిగా కోహ్లీకి ఉన్న గ్లోబల్ ఫాలోయింగ్​ను చెప్పొచ్చు. ఇలా వీళ్లిద్దరూ తమ ఆటతీరుతో క్రికెట్​కు ఎంతో సేవ చేశారు. ఇక, రికార్డుల సంగతి సరేసరి. 22 గజాల పిచ్​పై వీళ్లిద్దరూ అడుగు పెడితే ఎలా ఉంటుందో అందరికీ స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. బ్యాట్​తో సచిన్ సాధించిన రికార్డులు, భారత్​కు అందించిన విజయాలను ఎవరూ మర్చిపోలేరు. కోహ్లీ కూడా 15 ఏళ్ల కెరీర్​లో ఎన్నో పాత రికార్డులను బద్దలుకొట్టడమే గాక టీమిండియాకు అద్భుత విజయాలను అందించాడు.

క్రికెట్​ దేవుడిగా టెండూల్కర్​ పేరు తెచ్చుకుంటే.. మోడ్రన్ మాస్టర్​గా, కింగ్​గా విరాట్ గుర్తింపు సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ సాధించిన ఎన్నో రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ వరల్డ్ కప్​లో 50వ సెంచరీ పూర్తి చేసి నయా క్రికెట్ గాడ్​గా అవతరించాడు. బ్యాటింగ్, రికార్డులు, క్రేజ్, పాపులారిటీ దృష్ట్యా సచిన్​ స్థాయిని అందుకున్న కోహ్లీ.. బాధ విషయంలోనూ ఆయన్నే ఫాలో అవుతున్నాడు. ప్రపంచ కప్​ విషయంలో ఇద్దరిదీ ఒకే బాధ అని చెప్పొచ్చు. 2003 వరల్డ్ కప్​లో సచిన్ పడిన బాధ, వేదనను ఇప్పుడు కోహ్లీ కూడా ఎదుర్కొంటున్నాడు. 2003 ప్రపంచ కప్​లో సచిన్ 673 పరుగులతో టాప్ స్కోరర్​గా నిలిచాడు. టీమ్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మాస్టర్. కానీ ఏం లాభం.. మెగా టోర్నీ ఫైనల్లో పాంటింగ్ సేన చేతిలో ఓడి కప్పును చేజార్చుకుంది ఆసీస్. దీంతో మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకుంటున్నప్పుడు కొండంత బాధను పంటి కింద అదిమిపెట్టాడు.

వరల్డ్ కప్-2023లో విరాట్ కోహ్లీ కూడా 765 రన్స్ చేసి టోర్నమెంట్​లో టాప్ స్కోరర్​గా నిలిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్​ ది టోర్నీ అవార్డు అతడ్నే వరించింది. కానీ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోవడంతో అవార్డు తీసుకునే టైమ్​లో పెయిన్​ను లోపలే దాచుకున్నాడు. అప్పట్లో సచిన్, ఇప్పుడు కోహ్లీ అవార్డు తీసుకునే సమయంలో ఇద్దరి ఫేస్​లో ఎంతో బాధ కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్.. పాపం కోహ్లీ ఎంత బాగా ఆడినా టీమ్​ను గెలిపించలేకపోయాడని అంటున్నారు. టెండూల్కర్ స్థాయి నేమ్, ఫేమ్, రికార్డ్స్ సాధించినా.. అతడు అనుభవించిన బాధను కోహ్లీ కూడా చవిచూడక తప్పలేదని అంటున్నారు. ఓడినా, గెలిచినా భారత్ జట్టుకు తాము మద్దతు ఇస్తామని.. కోహ్లీ నిజమైన ఛాంపియన్ అని చెబుతున్నారు. మరి.. సచిన్​లాగే కోహ్లీ బాధను చవిచూడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓటమి! రోహిత్‌ శర్మపై సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి