iDreamPost

నడి రోడ్డుపై జుట్లు పట్టుకుని తన్నుకున్న మహిళలు

నడి రోడ్డుపై జుట్లు పట్టుకుని తన్నుకున్న మహిళలు

రెండు కొప్పులు ఒక చోట ఉంటే యుద్దాలే అన్న సామెత ఉంది. ఇద్దరూ ఆడవాళ్లు ఒకే చోట ఉంటే గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఈ మాట వచ్చింది. ఆ మాటలను సార్థకత చేస్తుంటారు మహిళలు. గతంలో పంపు కుళాయిల వద్ద కొట్లాడుకునే వారు. ఇల్లు, బజారు అని చూడకుండా, ఒంటి మీద దుస్తులు ఉడిపోతున్నా పట్టించుకోకుండా పిడి గుద్దులతో రెచ్చిపోయిన ఘటనలు అనేక సందర్భాల్లో చూసుంటారు. మధ్యలో అడ్డువచ్చిన వాళ్లను సైతం తన్నేసేవారు. అయితే ఇప్పుడు కుళాయిలు లేకపోవడంతో ఆ డ్రామా మిస్సైంది అనుకున్నారు. కానీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళల గురించి చదివాం, చూశాం. అలాగే మొన్నటి మొన్న చీరల గురించి మహిళలు తన్నుకు సచ్చిన వీడియో వైరల్ అయ్యింది.

తన్నుకోవడానికి కారణాలు చిన్నవైతే చాలు.. వాటిని ఆజ్యం పోసి..జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు మహిళలు. తాజాగా అటువంటి ఘటనే ఏకంగా విమానాశ్రయం ఎదుట జరిగింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ నిత్యం టాక్సీ కంపెనీలకు చెందిన డ్రైవర్ల మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి. తాజాగా మహిళ డ్రైవర్లు తన్నుకున్నారు. రాహుల్ ట్రావెల్స్, డబ్ల్యుటీఐ కంపెనీలకు చెందిన మహిళా డ్రైవర్లు ఓ విషయంలో గొడవకు దిగారు.  అదికాస్త చిలికి చిలికి గాలి వానగా మారింది. ఇంకేముందు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ.. జుట్లు పట్టుకుని లాక్కుని కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.  ఈ కేసులో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి