iDreamPost

మహిళలు మెచ్చిన ముఖ్యమంత్రి.. కారణం ఇదేనా..?

మహిళలు మెచ్చిన ముఖ్యమంత్రి.. కారణం ఇదేనా..?

శిశువు దగ్గర నుంచి ముదుసలి వరకూ… అందరి ఆలనా పాలనకు అనుగుణంగా.. పరిపాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది లోనే జన నేతగా ముద్రవేసుకున్నారు.. ఇంకా ప్రజలకు మేలు చేయాలనే తపనతో.. వారి అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కోరికతో.. ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సుకు శ్రీకారం చుట్టారు.

తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన సదస్సులో జగన్ పాలన గురించి మాట్లాడుతూ ఓ మహిళ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.మహిళల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, మధ్య నిషేధం అమలు కు జగన్ తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. దిశ చట్టం వచ్చాక మహిళలకు భద్రత పెరిగిందని, అతి తక్కువ రోజుల్లో మహిళా బాధితులకు న్యాయం జరుగుతోందని.. ఆనందం వ్యక్తం చేస్తూ.. అభిమానం ఆపుకోలేక ఆనంద భాష్పాలు తో ఆమె కళ్ళు చెమర్చాయి. దిశ చట్టం తెచ్చినందుకు మహిళల తరఫున ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామన్నారు. ‘ మీ లాంటి సీఎం ఇంతకు ముందు లేరు.. ఇకపై వస్తారనే నమ్మకం లేదు’ అంటూ భావోద్వేగానికి లోనైనతీరు.. జగన్ ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆదరణను చాటుతోంది. ఇంతలా ఆదరణకు ఆయన చేపట్టిన కార్యక్రమాలే నిదర్శనమని ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. చంద్రబాబు హయాంలో కనీస వేతనం కోసం అంగన్వాడీ లు ఉద్యమం చేస్తే గుర్రాలతో తొక్కించిన ఘనత ఆయనది. పాదయాత్రలో అంగన్వాడీ మహిళల కష్టాలను విన్న జగన్ నేనున్నా అంటూ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అతికొద్ది కాలంలోనే వారి వేతనాలు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ కార్మికులకు 11, 500, మినీ అంగన్వాడీ కార్మికులకు, సహాయకు లకు 7000కు వేతనం పెంచారు. హామీలపై తన చిత్త శుద్ది చాటుకున్నారు. మహిళలకు ఇచ్చిన తన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ తన పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులకు రూ .15 వేల ఆర్థిక సహాయం అందించే ‘జగన్నన్న అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం కోసం ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ .6455.80 కోట్లు కేటాయించింది, దీని కింద ప్రతి సంవత్సరం రూ .15 వేల ఆర్థిక సహాయం తల్లి లేదా సంరక్షకుడికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 1 వ తరగతి నుండి చదువుతున్న విద్యార్థులకు అంది స్తోంది.మొత్తం 43 లక్షల మంది మహిళలు లేదా పిల్లల సంరక్షకులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. తల్లులు తమ పిల్లలను బడికి పంపమని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రమాదకరమైన ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ గత నెలలో మహిళలకు ప్రయోజనం కలిగేలా వైయస్ఆర్ జీరో వడ్డీ రుణ పథకాన్ని ప్రారంభించారు, దీని కింద రూ .1,400 కోట్లు 8.78 లక్షల స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు సంవత్సరానికి రూ .20,000-40,000 రుణాలు పొందవచ్చు. ఇది రాష్ట్రవ్యాప్తంగా 91 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు ప్రయోజనం చేకూర్చింది. 8.78 లక్షల స్వయం సహాయక సంఘాలలో 6.95 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కరోనా కాలంలోనూ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మహిళల సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేసింది. అలాగే… వైయస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న కాపు మహిళలకు వచ్చే నెలలో రూ.15000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే.. ఈ పథకం కోసం 1,101 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయిదేళ్ల పాటు కాపు మహిళలు ఈ పథకం ద్వారా ఏటా రూ.15000 లబ్ధి పొందుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళ ల అభ్యున్నతికి జగన్ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలు ఎన్నో. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పొందని మహిళ ల ఆదరణను జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే అందుకున్నారు. మన పాలన – మీ సూచన కార్యక్రమంలో ప్రజలు తెలిపిన అభిప్రాయాలే ఇందుకు నిదర్శనం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి