iDreamPost

ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. సమాధిలో సజీవంగా 11 రోజులు!

ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. సమాధిలో సజీవంగా 11 రోజులు!

2018, జనవరి నెల..
బ్రెజిల్‌లోని రియాచావో దాస్‌ నివెస్‌కు చెందిన రోసెంజెలా అల్‌మైదా అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైంది. చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది. ఆమె మరణంతో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కొద్దిరోజుల తర్వాత ఆమెను దగ్గరలోని శ్మశానంలో సమాధి చేశారు. రోజులు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోసెంజెలా కుటుంబసభ్యులకు ఓ విషయం తెలిసింది. శ్మశానానికి వెళ్లిన వారికి రోసెంజెలా సమాధి దగ్గర వింత వింత శబ్ధాలు, అరుపులు వినపడుతున్నాయని జనం అనుకోసాగారు. దీంతో రోసెంజెలా కుటుంబంలో అనుమానం మొదలైంది.

వారు ఆమె సమాధి దగ్గరకు వెళ్లి.. దాన్ని తవ్వి బయటకు తీశారు. అప్పుడు శవ పేటికలో కొన్ని మార్పులను వారు గమనించారు. అంతేకాదు! రోసెంజలా ముఖం, మణికట్టుపై గాయాలను సైతం వారు గుర్తించారు. శవ పేటికలో కొంత రక్తం కూడా పడి ఉంది. గోళ్లతో గీకటం వల్ల శవ పేటిక పై భాగంలోని చెక్కకు గాట్లు కూడా పనినట్లుగా ఉంది. రోసెంజెలాను సమాధి చేసే టప్పుడు లేని ఆ గాయాలు ఇప్పుడు ఎలా వచ్చాయో తెలియక కుటుంబసభ్యులు ఆలోచనల్లో పడిపోయారు. బతికుండగానే రోసెంజెలాను పూడ్చిపెట్టేసామా అన్న అనుమానం కూడా కలిగింది.

ఈ విషయం అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు ఈ వింత సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.  కుటుంబసభ్యులు రోసెంజెలాను బతికుండగానే సమాధి చేయలేదని తేల్చారు. వింత వింత శబ్ధాలు, అరుపులు కేవలం పుకార్లు అయి ఉంటాయని పోలీసులు తెలిపారు. రోసెంజెలా వింత కేసును క్లోజ్‌ చేశారు. కాగా, బ్రెజిల్‌ న్యాయ శాస్త్రాల ప్రకారం బతికున్న వారిని పొరపాటున సమాధి చేసినా.. వారికి మూడు ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి