iDreamPost

అంబాజీపేట మ్యారేజి బ్యాండు యూనిట్ వ్యూహం ఫలిస్తుందా?

  • Published Feb 01, 2024 | 1:04 PMUpdated Feb 01, 2024 | 1:04 PM

సంక్రాంతి సినిమాల తరువాత పెద్దగా రిలీజ్ లు లేకపోవడంతో ఈ వీకెండ్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం లేకపోలేదు. మరి అంబాజీపేట మ్యారేజి బ్యాండు యూనిట్ వ్యూహం ఫలిస్తుందా?

యువ నటుడు సుహాస్ హీరోగా ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా మహా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. కాగా ఈ రోజు రాత్రి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసుకున్న కొన్ని థియేటర్లలో ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్లు నిర్వహిస్తున్నారు.. ఆయా షోలకు ప్రేక్షకుల ఉత్సాహం కూడా తోడయింది.

నూతన దర్శకుడు దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో శివానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఆసక్తికరమైన కథాంశంతో పాజిటివ్ బజ్ పెంచింది.

టీమ్ ప్రమోషనల్ టూర్ కు విపరీతమైన ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో పైన చెప్పున్న విధంగా నిర్మాతలు ఫిబ్రవరి 1న అంటే ఈరోజు రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ను ఎంచుకుంటున్నారు. సంక్రాంతి సినిమాల తరువాత పెద్దగా రిలీజ్ లు లేకపోవడంతో ఈ వీకెండ్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం లేకపోలేదు. మరి అంబాజీపేట మ్యారేజి బ్యాండు యూనిట్ వ్యూహం ఫలిస్తుందా? అనే ప్రశ్నకు పెయిడ్ ప్రీమియర్స్ నుంచి వచ్చే టాక్ ఏ సమాధానం చెబుతుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి