iDreamPost

Indian 2 : కాజల్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు ?

Indian 2 : కాజల్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు ?

ఎట్టకేలకు నెలల తరబడి వాయిదా పడుతూ వచ్చిన శంకర్ కమల్ హాసన్ ల ఇండియన్ 2 డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఒకరిమీద ఒకరు నిందలేసుకున్న నిర్మాణ సంస్థ లైకా, దర్శకుడు శంకర్ లు ఫైనల్ గా రాజీ పడ్డారు ఇంకో అరవై రోజులకు పైగా షూటింగ్ జరగాల్సి ఉందని చెన్నై టాక్. ఇప్పుడు దీని ఎఫెక్ట్ నేరుగా రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా మీద పడనుంది. ఇటీవలే పూణే షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన టీమ్ ఇక్కడే కొనస్గాగిస్తోంది. త్వరలో ఫారిన్ షూట్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు శంకర్ కనకే వచ్చే నెల నుంచి ఇండియన్ 2లో బిజీ అయితే చెర్రీ మూవీకి బ్రేక్ పడక తప్పదు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది

మరోవైపు ఇండియన్ 2లో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి. షూటింగులు చేసే పరిస్థితి లేదు. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ న్యూస్ అయితే కన్ఫర్మ్ అని ఇన్ సైడ్ టాక్. సో ఇప్పుడు ప్రత్యాన్మయం వెతుక్కోవాలి. మరి కాజల్ తో ఇప్పటికే తీసిన సీన్లను మళ్ళీ రీ షూట్ చేసుకోవాలి. ఇదంతా అదనపు ఖర్చు. కాకపోతే ఎక్కువ పార్ట్ జరగలేదని తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఎవరిని తీసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇప్పటికిప్పుడు డేట్లు ఇచ్చే ఇమేజ్ ఉన్న హీరోయిన్ అవసరం. 1996లో వచ్చిన భారతీయుడు సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్ 2లో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ లు కూడా ఉన్నారు

ఐ నుంచి ఫామ్ తగ్గిపోయిన శంకర్ కు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మూడు సినిమాలు చాలా కీలకం. పైన రెండింటితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్ తో చేస్తున్న అపరిచితుడు రీమేక్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒకప్పటిగలా మేజిక్ చేయలేకపోతున్నాడనే కామెంట్స్ కు బదులు చెప్పాలంటే ఇవి సక్సెస్ కావలసిందే. ముఖ్యంగా చరణ్ ది కనక కరెక్ట్ గా వర్కౌట్ అయితే మళ్ళీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ లతో నిర్మాతలు ముందుకు వస్తారు. ఇవన్నీ పూర్తయ్యేలోపు 2024 వచ్చేస్తుంది. ఒకవేళ ఇండియన్ 2కి కనక ఎక్కువ టైం పడితే రామ్ చరణ్ ఆ టైంలో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుకి డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి

Also Read : Puneeth Rajkumar : కనివిని ఎరుగని స్థాయిలో పునీత్ కు సంతర్పణ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి