iDreamPost

గ్రూప్ కాల్స్ సంఖ్యని రెట్టింపు చేసిన వాట్సాప్

గ్రూప్ కాల్స్ సంఖ్యని రెట్టింపు చేసిన వాట్సాప్

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త

కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వీడియో కాల్స్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. దాంతో వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాల్స్ లిమిట్ ను నాలుగు నుండి ఎనిమిదికి పెంచుతున్నట్లు ప్రకటించింది వాట్సాప్. గతంలో కేవలం నలుగురు మాత్రమే గ్రూప్ వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు వాట్సాప్ లో ఉండేది..

దాంతో ఎక్కువమంది గ్రూప్ కాల్స్ చేసుకునేందుకు జూమ్ అప్లికేషన్ ను వినియోగించడం మొదలుపెట్టారు. కానీ జూమ్ తరహా అప్లికేషన్లు వాడటం ప్రమాదకరం అని పలు నివేదికలు తేల్చిచెప్పాయి. దాంతో గ్రూప్ కాల్స్ చేసుకునే వినియోగదారులు వాట్సాప్ ని గ్రూప్ కాల్స్ చేసుకునే సంఖ్యను పెంచమని కోరడంతో వినియోగదారుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న వాట్సాప్ సంస్థ గ్రూప్ కాల్స్ ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో వాట్సాప్ లో కూడా జూమ్ తరహాలో ఎనిమిదిమంది గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వాట్సాప్ కస్టమర్ల ప్రైవసీకి కూడా ఎలాంటి భంగం కలగదని వాట్సాప్ వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి