iDreamPost

నామినేషన్‌కు ముందు ఆ గుడికి కేసీఆర్.. సెంటిమెంట్ కథేంటంటే..?

తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం స్టార్ అయ్యింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం స్టార్ అయ్యింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

నామినేషన్‌కు ముందు ఆ గుడికి కేసీఆర్.. సెంటిమెంట్ కథేంటంటే..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. ఈ నెల 30న జరిగే ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. తొలి రోజైన శుక్రవారం.. 100 లోపు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇదే సమయంలో కొంత మంది సెంటి మెంట్ ఫాలో అవుతుంటారు. నామినేషన్లకు ముందు దేవాలయాలను సందర్శిస్తుంటారు. నామినేషన్లకు వెళ్లే ముందు తమకు నచ్చిన వ్యక్తులు ఎదురు రమ్మనడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిసారి ఆ గుడిని దర్శించుకుని నామినేషన్లు వేస్తుంటారు.

అదే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాతే.. నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేస్తారు. ఇదే సెంటిమెంట్‌ను కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు. దీనికి కారణం కూడా ఉంది. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీ తరుఫున తొలిసారిగా బరిలోకి దిగారు కేసీఆర్. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఐతే రెండేళ్లకే 1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ మయంలో కోయినా పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి, నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందడంతో అప్పటి నుండి.. సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

1989 నుండి 2018 వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సంస్కృతిని అనుసరించారు. ప్రతి సారి గెలిచారు. ఆ సెంటిమెంట్ కారణంగానే ఇప్పుడు కూడా ఆ దేవాలయంలో శనివారం పూజలు నిర్వహించి.. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారు కేసీఆర్. ఈ సారి ఈ రెండు నామినేషన్లను శ్రీవారి పాదాల చెంత ఉంచి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వాటిపై సంతకాలు చేస్తారు. వీటిని ఈ నెల 9వ తేదీన దాఖలు చేస్తారు. తొలుత గజ్వేల్, ఆ తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి