iDreamPost

Bheemla Nayak : ఈ వారమంతా పవర్ స్టార్ సందడే

Bheemla Nayak : ఈ వారమంతా పవర్ స్టార్ సందడే

ఇంకో అయిదే రోజుల్లో భీమ్లా నాయక్ సినిమా హాల్లో అడుగుపెట్టబోతున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. హైదరాబాద్ లో తెల్లవారుఝామున బెనిఫిట్ షోలకు థియేటర్లు ముస్తాబవుతున్నాయి అభిమానులు రెడీ అవుతున్నారు. రెండు నెలల తర్వాత బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్టార్ హీరో మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఊగిపోతున్నారు. ఫస్ట్ డే ఎలాంటి రికార్డులు నమోదు కాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు హిందీ వెర్షన్ కూడా అదే రోజు రానుండటంతో ఇప్పుడు పుష్ప పార్ట్ 1 సాధించిన రికార్డులు టార్గెట్ గా కలెక్షన్ల వేట మొదలుకానుంది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు భీమ్లా నాయక్ థియేట్రికల్ బిజినెస్ 110 కోట్ల దాకా జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే దీనికి ఇంకో అయిదు కోట్లు అదనంగా తెచ్చేస్తే సరిపోతుంది. ఆపై వచ్చేవన్నీ లాభాలవుతాయి. అన్ని హక్కులు కలుపుకుని సితార సంస్థ సుమారు 180 కోట్ల దాకా రాబట్టినట్టు ఇన్ సైడ్ టాక్. రీమేక్ సినిమాకు ఈ స్థాయిలో ఆదాయమంటే అది మాములు విషయం కాదు. దెబ్బకు అజిత్ వలిమైకు తెలుగులో హైప్ రాలేకపోతోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వసూళ్ల ఊచకోతకు హద్దులు ఉండవు. ఈ తాకిడికి భయపడే గని ఆల్రెడీ రేస్ నుంచి తప్పుకోగా ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా పోస్ట్ పోన్ దిశగా వెళ్తోందట.

ఓటిటి హక్కులకు సంబంధించి కూడా భీమ్లా నాయక్ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. హాట్ స్టార్ తో ఆహా కలిసి సంయుక్తంగా హక్కులు కొనుగోలు చేశాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఇండియాలో అందరికీ రెండు ఆప్షన్లుగా వస్తుందా లేక ఓవర్ సీస్ ప్రేక్షకులకు మాత్రమే ఆహాలో స్ట్రీమింగ్ వస్తుందా లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏపిలోనూ ఆంక్షలు తీసేయడంతో టికెట్ రేట్లు పెంచకపోయినా ఎక్కువ సంఖ్య స్క్రీన్లలో వేయడం వల్ల వసూళ్ల పరంగా ఎలాంటి ఢోకా ఉండదు. ఈ నెల 21న మంత్రి కెటిఆర్ తో పాటు మరికొందరు ముఖ్యఅతిథులుగా హైద్రాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు

Also Read : Movie Entertainment : డెఫినెషన్ మార్చుకుంటున్న సినిమా వినోదం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి