iDreamPost

HYDలో రెండు రోజుల పాటు నల్లా నీళ్లు బంద్..

హైదరాబాద్ మహా నగరంలో నీటి కొరత చాలా ఉంటుంది. ఇక్కడ రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉంటాయి. అటువంటి వారి కోసమే ఈ అలర్ట్. భాగ్య నగరిలో రెండు రోజుల పాటు నీళ్లు బంద్ కానున్నాయి.

హైదరాబాద్ మహా నగరంలో నీటి కొరత చాలా ఉంటుంది. ఇక్కడ రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉంటాయి. అటువంటి వారి కోసమే ఈ అలర్ట్. భాగ్య నగరిలో రెండు రోజుల పాటు నీళ్లు బంద్ కానున్నాయి.

HYDలో రెండు రోజుల పాటు నల్లా నీళ్లు బంద్..

హైదరాబాద్‌లో బిర్యానీ రోజు అయినా దొరుకుతుందేమో కానీ.. మంచి నీళ్లు కాదూ. ఇక్కడ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తూ ఉంటారు. వాతావరణం, వేగవంతమైన పట్టణాభివృద్ధి.. జనాభా పెరుగుదల, సరిపడా నీటి మౌలిక సదుపాయాల లేమి కారణంగా ఎప్పుడు ఈ భాగ్య నగరి నీటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక ఎండాకాలంలో చెప్పనక్కర్లేదు. నీటి ఎద్దడి పీక్స్‌లో ఉంటుంది. అలాంటిది రెండు రోజులు నల్లా రాదని తెలిస్తే.. ఇప్పుడు నుండే దిగులుపడిపోరు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న గిన్నెలు, గ్లాసులు కూడా నింపేస్తారు. అలాంటి వారి కోసమే ఈ వార్త. హైదరాబాద్ నగరంలో రెండు రోజులు పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.

మరమ్మతు పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సరఫరా ఆగిపోనుంది. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చేపట్టిన మరమ్మతు పనుల కారణంగా నీళ్లు రావు. ఈ జనవరి 20వ తేదీ ఉదయం 6 గంటల నుండి జనవరి 21వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. మహా నగరానికి మంచి నీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి పేజ్-1లో మిరాలం, అలియాబాద్ ఆఫ్ టేక్ ప్రాంతం వద్దనున్న 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్లకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. చాంద్రాయణ గుట్టలోని సన్నీ గార్డెన్ నుండి షోయవ్ హోటల్ వరకు బాక్స్ డ్రెయిన్ పనులకు ఇబ్బందుల్లేకుండా ఈ పనులు చేపడుతున్నారు.

Tap water

ఈ మరమ్మత్తుల కారణంగా.. మిస్ట్రీ గంజ్, బహదూర్ పురా, జహానుమా, మొఘల్ పురా, దారుల షిఫా, గౌలిపురా,తలాబ్ కట్ట, రియాసత్ నగర్, పత్తర్ ఘట్టి, అల్ జుబైల్ కాలని, సుల్తాన్ షాహి, అలియాబాద్, కిషన్ బాగ్ ప్రాంతాలకు నీటి సరఫరా జరగదు. అయితే భాగ్య నగరిిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటం ఇది రెండవ సారి కావడం గమనార్హం. జనవరి 3వ తేదీ ఉదయం 6 గంటల నుండి 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లోని నివాసితులు ఇబ్బందులు పడ్డారు. ఒక్క రోజు నీళ్లు రావనుకుంటే.. సుమారు రెండు రోజుల పాటు నీళ్లు రాకపోతే.. పరిస్థితి ఏంటంటారు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి