iDreamPost

షాపింగ్ మాల్స్‌లో స్ట్రిక్ట్ రూల్స్! ఇక వాష్ రూమ్స్‌లోకి కస్టమర్స్ నో ఎంట్రీ?

ఎండాకాలం మొదలైంది. సూర్యుని కిరణాలు సర్రుమంటూ తాకుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. అంతలోనే బెంగళూరు ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఎండాకాలం మొదలైంది. సూర్యుని కిరణాలు సర్రుమంటూ తాకుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. అంతలోనే బెంగళూరు ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.

షాపింగ్ మాల్స్‌లో స్ట్రిక్ట్ రూల్స్! ఇక వాష్ రూమ్స్‌లోకి కస్టమర్స్ నో ఎంట్రీ?

సమ్మర్ సీజన్ వచ్చేసింది. భానుడు భగ భగ మండుతున్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. మెల్లిగా వేడి గాలులు మొదలయ్యాయి. అంతలోనే కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి కష్టాలు మొదలు అయ్యాయి. ఎండలు ముదరకుండానే మంచి నీటి కోసం కటకట మొదలైంది. భూగర్భ జలాలు అడుగు అంటడంతో నీళ్ల సమస్య మొదలైంది. ఈ క్రమంలో ఈ సమస్యను తగ్గించేందుకు వాహనాలు కడగడం, తోట పని, వాటర్ ఫౌంటైన్లకు నీటిని వినియోగించడాన్ని నిషేధించింది బెంగళూరు నీటి సరఫరా, మురుగు నీటి బోర్డు (బిడబ్ల్యుఎస్ఎస్‌బి). ఉత్తర్వులు ఉల్లంఘించిన వారికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామని పేర్కొంది.

అయినప్పటికీ  నీరు లేక నానా తిప్పలు పడుతున్నారు.  పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు నగర వాసులు.  తాగు నీటికే కాకుండా స్నానాలకు, ఇతర అవసరాలకు నీటి సమస్య ఏర్పడటంతో చాలా మంది పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లకు వెళుతున్నారు. షాపింగ్ పేరుతో వాటిల్లోని వాష్ రూంలో కాలకృత్యాలు, స్నానాలు చేసి వస్తున్నారట. దీంతో ఎన్నడూ లేని విధంగా మాల్స్‌లో కూడా జన సంచారం పెరిగిపోయింది.  చివరకు షాపింగ్ కాంప్లెక్స్ యజమానుల దృష్టికి ఈ విషయం చేరడంతో.. కొత్త రూల్స్ తీసుకు వచ్చారట. అక్కడ కూడా నో ఎంట్రీ బోర్డులు దర్శనమిస్తున్నాయట. కస్టమర్లను వాష్ రూమ్స్ లోకి వెళ్లనియకుండా వాటిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ స్ట్రిట్ రూల్స్ పాస్ చేసినట్లు తెలుస్తోంది దీంతో మరో మార్గం లేక ఇంటి బాట పడుతున్నారట నగర వాసులు.

ఎండలు తీవ్రంగా మారకుండానే ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంటే.. ఉష్ణోగ్రత స్థాయిలు పెరిగి.. నీటి ఎద్దడి సమస్య మరింత కఠినతరం అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం తాగు నీటి అవసరాల కోసమే వాటర్ ట్యాంకులను ఆశ్రయిస్తున్నారు బెంగళూరు ప్రజలు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న ట్యాంకర్ యజమానులు.. వాటి ధరలను పెంచేస్తున్నారు. గతంలో ట్యాంక్ వాటర్ రూ. 800 వరకు పలికితే.. ఇప్పుడు రెండు వేల రూపాయలను దాటేస్తుందని వినికిడి. ఇక వాటర్ టిన్లు తెచ్చుకుని వాటితోనే వంట, దాహర్తితో పాటు ఇతర అవసరాలకు తీర్చుకుంటున్నారట. అయితే ఈ సమస్యపై కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించింది. తాగు నీటి సమస్యను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మరీ వీరి కష్టాలు తీరుతాయో.. లేదో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి