iDreamPost

వారియర్ కోసం రామ్ రిస్క్

వారియర్ కోసం రామ్ రిస్క్

ఇస్మార్ట్ శంకర్ తో మాస్ లో బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ వచ్చే నెల ది వారియర్ తో రాబోతున్నాడు. దీని మీద నమ్మకంతో రెమ్యునరేషన్ లో కొంత భాగం వైజాగ్ ప్రాంతం డిస్ట్రిబ్యూషన్ హక్కుల రూపంలో నాలుగున్నర కోట్లకు సొంతం చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆంధ్ర ఏరియా 18 కోట్లకు అమ్ముడుపోగా అందులో సింహభాగం వైజాగ్ దే. హిట్ టాక్ వస్తే ఆ మొత్తం రావడం కష్టమేమి కాదు. అందులోనూ రామ్ కు బిజినెస్ రేంజ్ ఇప్పుడు బాగుంది. రెడ్ ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ దాని వల్ల వచ్చిన నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఎక్కువగా లేకపోయింది. అందుకే ది వారియర్ కు అన్ని ప్రాంతాల నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి

ఇలా హీరోలు పంపిణి హక్కులు తీసుకోవడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్ చిరంజీవి హయాం నుంచి మహేష్ బాబు దాకా అందరూ చేసిందే. కాకపోతే ఫలితం ఎలా ఉండబోతోందో ముందే ఊహించలేని పరిస్థితుల్లో ఇప్పటి స్టార్లు అలాంటి సాహసం చేయడం లేదు. కానీ ది వారియర్ కోసం రామ్ పెట్టుబడి పెడుతున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా ఇందులో చాలా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. దేవిశ్రీప్రసాద్ సంగీతం మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డాక్టర్ గా రామ్ ది మరో పాత్ర ఉంటుందని, డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్ ఉంది కానీ అదెంతవరకు నిజమో రిలీజయ్యాకే తెలుస్తుంది.

ఎటొచ్చి దర్శకుడు లింగుస్వామి ట్రాక్ రికార్డే కొంత టెన్షన్ పెడుతోంది. ఆయనకు చాలా కాలంగా హిట్టు లేదు. పందెం కోడి తర్వాత ఆవారా బాగా ఆడింది. వెట్టై అంతకన్నా పెద్ద సక్సెస్. తెలుగులో నాగ చైతన్య సునీల్ తో తడాఖాగా రీమేక్ చేశారు. ఇది 2014కు ముందు. సూర్యతో సికందర్ దారుణంగా దెబ్బ కొట్టగా పందెం కోడి 2 మాస్ సెంటర్స్ లో ఓ మాదిరిగా వెళ్ళింది కానీ మిగిలిన చోట్ల ఫ్లాపే. కట్ చేస్తే మధ్యలో నాలుగేళ్ళ గ్యాప్. ది వారియర్ ని ముందు అల్లు అర్జున్ తో అనుకున్నారు. అప్పట్లో చిన్న లాంచ్ ఈవెంట్ చేశారు. ఏమయ్యిందో కానీ బన్నీ తర్వాత డ్రాప్ అనేశాడు. ఇప్పుడది రామ్ చేస్తున్నారు. మరి రామ్ కిది ఎలాంటి ఫలితాన్నినిస్తుందో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి