iDreamPost

ప్రకృతిలో పరవశిస్తున్న వితికా షేర్.. ఇదే నా హ్యపీ స్పేస్ అంటూ

వితికా షేరు ఈ పేరు తెలియని యూట్యూబ్ వీక్షకులు ఉండరేమో బహుశా. తన వీడియోలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ నటి..ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉంది. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

వితికా షేరు ఈ పేరు తెలియని యూట్యూబ్ వీక్షకులు ఉండరేమో బహుశా. తన వీడియోలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ నటి..ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉంది. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రకృతిలో పరవశిస్తున్న వితికా షేర్.. ఇదే నా హ్యపీ స్పేస్ అంటూ

చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వితికా షేరు. పదహారాణాల తెలుగు అమ్మాయైన వితికా.. 15 ఏళ్ల వయసులోనే కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ అయ్యింది. అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమాతో శాండిల్ వుడ్‌లోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమించు రోజుల్లో సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఝుమ్మంది నాదం, భీమిలీ కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది వితిక. యంగ్ హీరో వరుణ్ సందేశ్ సరసన పడ్డానండి ప్రేమలో నటించి.. అతడితో నిజజీవితంలో లవ్ లో  పడింది. ఆ తర్వాత ఓ తమిళ సినిమా చేసింది. పెద్దల అంగీకారంతో 2016లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. తన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా, పార్టీ జరిగిన దానికి సంబంధించిన డెకరేటివ్ వర్క్ చేస్తూ ఫుల్ హడావుడి చేస్తుంది. ఇలా అలాగే భర్త మూవీ అప్డేట్స్ తో పాటు తన ఫోటో షూట్స్, వెకేషన్ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్‌లో పోస్టు చేసి మస్త్ హల్ చల్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ మధ్య భర్తతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3లోకి అడుగుపెట్టింది. అందులో ఈ జంట బాగా ఆకట్టుకుంది.  బయటకు వచ్చాక మరింత యాక్టివ్ అయ్యింది వితికా.  అప్పుడప్పుడు బుల్లితెరపై కనిపిస్తూ ఉంటుంది. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంది.

అచ్చమైన గృహిణీలా మారిపోయి.. అవకాయ పచ్చడి నుండి ఇల్లు సర్దుకోవడం వంటి టిప్స్ చెబుతూ ఉంటుంది.  దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.  అలాగే ఇటీవల నిహారిక,  యూట్యూబర్ జాహ్నవితో కలిసి  ఓ యాడ్ చేసిన సంగతి  విదితమే. ఇప్పుడు సోదరి కృతిక షేరుతో కలిసి వరుస ట్రిప్పులు వేస్తుంది. థాయ్ లాండ్ సముద్ర అలల్లో తేలి ఆడుతుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది. అక్కడ ప్రకృతిలో పరవశించిపోతుంది వితికా. అక్కడ ఏనుగుతో కలిసి ఫోటో షూట్ చేసింది. ఆ పిక్స్ షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Vithika Sheru (@vithikasheru)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి