iDreamPost

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విరాట్ కే మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు?

తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్త కోహ్లీ ఫ్యాన్స్ ను సంతోషానికి గురిచేస్తోంది. విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా చూడబోతున్నామని తెలుస్తోంది.

తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్త కోహ్లీ ఫ్యాన్స్ ను సంతోషానికి గురిచేస్తోంది. విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా చూడబోతున్నామని తెలుస్తోంది.

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విరాట్ కే మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు?

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తున్న రారాజు. అందుకే ఫ్యాన్స్ ముద్దుగా ‘రన్ మెషిన్’ అని పిలుచుకుంటారు. ఇక వరల్డ్ క్రికెట్ లో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులు కోకొల్లలు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు జట్టుతో కలిశాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్త కోహ్లీ ఫ్యాన్స్ ను సంతోషానికి గురిచేస్తోంది. విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా చూడబోతున్నామని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా చూడాలని చాలా మంది క్రికెట్ అభిమానులతో పాటుగా ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్.. విరాట్ కోహ్లీకే మళ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ సారథ్య బాధ్యతలు అప్పగించబోతోందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు ఆర్సీబీ. దానికి కారణం కింగ్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత 16 సీజన్లలో ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయింది ఆర్సీబీ. ఈ విషయంలో కోహ్లీ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యం కెప్టెన్ గా డుప్లెసిస్ ప్లేస్ లో విరాట్ కు పగ్గాలను అందించాలని భావిస్తుందని సమాచారం. గత రెండు సీజన్లలో ఆర్సీబీ జట్టుకు డుప్లెసిస్ నాయకత్వం వహించాడు. అతడి కెప్టెన్సీలో మెుత్తం 27 మ్యాచ్ లు ఆడగా.. 14 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది.

virat kohli new captain

అయితే గత సీజన్ లో మూడు మ్యాచ్ లకు విరాట్ సారథ్యం వహించి.. తన దూకుడైన కెప్టెన్సీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతడికే సారథ్య పగ్గాలు అందించాలని యాజమాన్యం భావిస్తోందట. పైగా విరాట్ కు టీమిండియాకు కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా కలిసి వస్తుందనుకుంటోంది. అయితే గతంలో టీమిండియా కెప్టెన్ గా ఉండటంతో.. ఒత్తిడి కారణంగా ఆర్సీబీ టీమ్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ ప్రకటించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో దేనికి కూడా విరాట్ కెప్టెన్ గా లేడు. దీంతో కోహ్లీని కెప్టెన్ చేస్తే.. మంచి ఫలితాలను రాబట్టగలం అనేది బెంగళూరు యాజమాన్యం ఆలోచన. అదీకాక 39 డుప్లెసిస్ రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. మరి కెప్టెన్ గా విరాట్ కోహ్లీని నియమిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి