iDreamPost

వీడియో: విరాట్ సలహాతో సిరాజ్ కు వికెట్.. కింగ్ ఊరికే అయిపోరు..

Kohli Suggestions To Siraj: మహ్మద్ సిరాజ్ రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా జట్టును వణికించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 6 వికెట్లతో చలరేగాడు.

Kohli Suggestions To Siraj: మహ్మద్ సిరాజ్ రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా జట్టును వణికించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 6 వికెట్లతో చలరేగాడు.

వీడియో: విరాట్ సలహాతో సిరాజ్ కు వికెట్.. కింగ్ ఊరికే అయిపోరు..

ప్రస్తుతం టీమిండియా న్యూల్యాండ్స్ లో సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ లో తలపడుతోంది. నిజానికి తలపడుతోంది అనేకంటే చీల్చి చెండాడుతోంది అంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు గల్లీ క్రికెటర్స్ మాదిరి కనిపించారు. ఎక్కడా కూడా పోరాటాన్ని ప్రదర్శించలేకపోయారు. సిరాజ్, బుమ్రా, ముఖేశ్ విసిరే బంతులకు సరెండర్ అయిపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆధిపత్యం మాత్రమే కాకుండా.. తొలి టెస్టుకి సంబంధించి ప్రతీకారం కూడా తీర్చుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో సిరాజ్ విజృంభించిన తీరుకు సౌత్ ఆఫ్రికా జట్టు కళ్లు తేలేసింది. మొత్తం 6 వికెట్లు తీసిన సిరాజ్.. ఒక వికెట్ క్రెడిట్ మాత్రం కోహ్లీకి ఇవ్వాల్సిందే.

మ్యాచ్ ప్రారంభం నుంచి సిరాజ్ తనదైనశైలిలో బంతితో చలరేగాడు. ఎక్కడా కూడా ప్రొటీస్ జట్టుకు ఆస్కారం లేకుండా చేశాడు. అతనికి తోడు బుమ్రా, ముఖేశ్ కూడా విజృంభిచండంతో సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సఫారీలు తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేశారు. ఈ ఘనతో సింహభాగం సిరాజ్ కే దక్కుతుంది. ఇంక ఈ మ్యాచ్ లో పదునైన బంతులు వేయడం మాత్రమే కాకుండా సిరాజ్ వ్యూహాత్మకంగా బౌలింగ్ చేశాడు. ఉదాహరణకు ఎల్గర్ ను సిరాజ్ పక్కా వ్యూహం ప్రకారం అవుట్ చేశాడు. ఆడేందుకు ఆస్కారం లేకుండా డాట్ బాల్స్ వేస్తూ.. ఎల్గర్ ని ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత గుడ్ లైన్ అండ్ లెంగ్త్ తో బాల్ వేసి బౌల్డ్ చేశాడు. ఈ స్పెల్ చూసిన తర్వాత ఎల్గర్ కూడా అవాక్కయ్యాడు.

మహ్మద్ సిరాజ్ ఒక్కో బ్యాటర్ కు ఒక్కో విధంగా బాల్స్ వేస్తూ ముప్పతిప్పలు పెట్టాడు. మొత్తానికి ఈ రెండో టెస్టులో సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక వికెట్ క్రెడిట్ మాత్రం విరాట్ కోహ్లీకో దక్కుతుంది. ఎందుకంటే కింగ్ కోహ్లీ ఇచ్చిన సలహాతో జాన్సన్ ను సిరాజ్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. సిరాజ్ ఇన్నింగ్స్ లో 16వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. జాన్సన్ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. సిరాజ్ లెగ్ కట్టర్ వేశాడు. జాన్సన్ ని ఆడేందుకు ఫోర్స్ చేస్తూ లెంగ్త్ బాల్ వేశాడు.. దానిని ఫ్రంట్ ఫుట్ మీదకు వచ్చి జాన్సన్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి ముందు వికెట్స్ వెనుక ఉన్న కింగ్ కోహ్లీ.. సిరాజ్ కు సైగ చేశాడు. లెగ్ కట్టర్ వేస్తే.. కీపర్ కు క్యాచ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటూ సైగలతో చెప్పాడు.

కోహ్లీ చెప్పిన విధంగానే సిరాజ్ బౌలింగ్ చేసి జాన్సన్ ను అవుట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత కోహ్లీ- సిరాజ్ బాండింగ్ గురించి కూడా చర్చించుకుంటున్నారు. వారి మధ్య ఉండే అండర్ స్టాండింగ్, అనుబంధానికి ఈ సీన్ ఒక చక్కని ఉదాహరణ అంటూ చెబుతున్నారు. మొత్తానికి కింగ్ కోహ్లీ సలహాతో సిరాజ్ కు వికెట్ దక్కిం. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో కేవలం 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన సిరాజ్.. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్ లో సిరాజ్ పేరు మారు మోగుతోంది. మరి.. కోహ్లీ సలహాతో సిరాజ్ వికెట్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి