iDreamPost

Virat Kohli: సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కి ముందు ఇండియాకు తిరిగొచ్చేసిన కోహ్లీ! కారణం ఏంటి?

  • Published Dec 22, 2023 | 3:42 PMUpdated Dec 22, 2023 | 4:49 PM

ఇండియా-సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు విరాట్‌ కోహ్లీ ఇంటికి తిరిగి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి కోహ్లీ ఎందుకు తిరిగి వచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌, మూడు వన్డేల సిరీస్‌ను పూర్తి చేసుకున్న భారత జట్టు.. రెండు టెస్టుల సిరీస్‌ కోసం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌కు గురిచేసే ఒక వార్త వెలుగులోకి వచ్చింది. టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇప్పటికే సౌతాఫ్రికా చేరుకున్న విరాట్‌ కోహ్లీ.. ఈ రోజు హుటాహుటిన తిరిగి ఇండియాకు వచ్చేసినట్లు సమాచారం. ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల కోహ్లీ ఇంటికి తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. కానీ, అసలు కారణం ఏంటో మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కోహ్లీ ఇంటికి తిరిగి రావడంతో.. సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? ఉండడా అనేది అనుమానంగా మారింది.

ఇప్పటికే టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన యంగ్‌ టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచి.. సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు అసలు సిసలైన భారత జట్టు టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికాను ఢీ కొట్టినుంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఓటమి తర్వాత.. తొలి సారి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో ఇండియా-సౌతాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌పై క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఓటమి బాధ నుంచి బయటపడి.. రోహిత్‌-విరాట్‌ ఎలా ఆడతారో అని భారత క్రికెట్‌ అభిమానులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రో-కో ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీకి ఇంటికి రావడం చర్చనీయాంశంగా మారింది.

కుటుంబానికి సంబంధించి ఏదో ఎమర్జెన్సీ పనిమీద కోహ్లీ.. సౌతాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చినట్లు ఇప్పటి వరకు అందిన సమాచారం. అయితే.. ఈ నెల 26 నుంచి సౌతాఫ్రికా-ఇండియా మధ్య సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కోహ్లీ తిరిగి సౌతాఫ్రికాకు వెళ్లిపోయి… తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని క్రికెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి టెస్ట్‌కు మరో నాలుగు రోజుల సమయం ఉన్నందున కోహ్లీ అభిమానులు కానీ, భారత క్రికెట్‌ అభిమానులు కానీ కంగారు పడాల్సిన పనిలేదు. మరి కోహ్లీ ఉన్నపళంగా సౌతాఫ్రికా నుంచి ఇండియాకు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి