iDreamPost

వీడియో: RCB చెత్త ప్రదర్శన కోహ్లీ ఎమోషనల్‌! డ్రెస్సింగ్‌ రూమ్‌లో..!

  • Published Apr 03, 2024 | 2:03 PMUpdated Apr 03, 2024 | 2:03 PM

Virat Kohli, RCB vs LSG, IPL 2024: వరుస ఓటములు, టీమ్‌ చెత్త ప్రదర్శనతో ఆర్సీబీ అభిమానులే కాదు.. ఆ టీమ్‌కు ఫేస్‌ లాంటి విరాట్‌ కోహ్లీ కూడా బాధలో ఉన్నాడు. లక్నోతో ఓటమి తర్వాత.. కోహ్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో చేసిన పని చూస్తే.. విషయం అర్థమవుతుంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, RCB vs LSG, IPL 2024: వరుస ఓటములు, టీమ్‌ చెత్త ప్రదర్శనతో ఆర్సీబీ అభిమానులే కాదు.. ఆ టీమ్‌కు ఫేస్‌ లాంటి విరాట్‌ కోహ్లీ కూడా బాధలో ఉన్నాడు. లక్నోతో ఓటమి తర్వాత.. కోహ్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో చేసిన పని చూస్తే.. విషయం అర్థమవుతుంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 03, 2024 | 2:03 PMUpdated Apr 03, 2024 | 2:03 PM
వీడియో: RCB చెత్త ప్రదర్శన కోహ్లీ ఎమోషనల్‌! డ్రెస్సింగ్‌ రూమ్‌లో..!

ఐపీఎల్‌ 2024లో భాగంగా మంగళవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆర్సీబీ హోంగ్రౌండ్‌ అయిన బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే గ్రౌండ్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 182 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన ఆర్సీబీ.. ఇప్పడు లక్నోపై 182 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేకపో ఓడిపోయింది. ఈ ఓటమితో సీజన్‌లో మూడో ఓటమిని మూటగట్టుకుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. ఒక విజయం, మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. అయితే.. లక్నోపై ఓటమితో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అలాగే ఆ స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ సైతం టీమ్‌ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉ‍న్నాడు.

ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 2 ఫోరు​, ఒక సిక్స్‌తో 22 పరుగులు చేసిన కోహ్లీ.. వేగంగా ఆడే క్రమంలో అవుట్‌ అయ్యాడు. కోహ్లీ వికెట్‌ పడిన తర్వాత.. ఆర్సీబీ వికెట్లు వరుసగా టపటపా పడిపోయాయి. ముఖ్యంగా టీమ్‌లో ప్రధాన ఆటగాళ్లు అయినా కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అయితే వాళ్ల స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. అలాగే యువ క్రికెటర్లు రజత్‌ పాటిదార్‌, అనుజ్‌ రావత్‌ కూడా విఫలం అవుతున్నారు. బౌలింగ్‌ విభాగం గురించ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రధాన బౌలర్‌గా ఉన్న మొహమ్మద్‌ సిరాజ్‌ వైఫల్యం ఆ జట్టు బౌలింగ్‌ డిపార్డ్‌మెంట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోట్లు పెట్టి కొన్న అల్జారీ జోసెఫ్‌ నట్టేట ముంచాడు. అతన్ని తీసేసి.. టోప్లీని తీసుకున్న అతను కూడా రాణించలేదు. మొత్తం ఆర్సీబీ బౌలింగ్‌ ఈ సీజన్‌లో చాలా చెత్తగా ఉంది.

ఇక బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఎంతని ఆడతాడు. ప్రతి మ్యాచ్‌లో అతనే ఆడాలంటే కష్టం కదా. ఆర్సీబీ అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోతున్నా.. విరాట్‌ కోహ్లీ ఆరెంజ్‌ క్యాచ్‌ హోల్డర్‌గా ఉన్నాడు. అలా అని ప్రతి మ్యాచ్‌ అతనే గెలిపించాలంటే అది కాని పని. క్రికెట్‌ అంటేనే టీమ్‌ గేమ్‌. ఒక్క కోహ్లీ ఎంత అద్భుతంగా ఆడినా.. జట్టులోని మిగతా ఆటగాళ్లు చేతులెత్తేస్తే.. గెలువడం కష్టం. కాగా, రోజు రోజుకి జట్టు పరిస్థితి మరీ తీసికట్టుగా మారిపోతుండటంతో విరాట్‌ కోహ్లీలో కూడా అసహనం పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం లక్నోతో మ్యాచ్‌ ఓటమి తర్వాత కోహ్లీ చాలా సీరియస్‌గా కనిపించాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో చైర్‌ను బాదేస్తున్న వీడియో, టీమ్‌ మీటింగ్‌లో చాలా డల్‌గా కూర్చున్న ఫొటోలు చూస్తే.. కోహ్లీ ఎంతలా బాధపడుతున్నాడో అర్థం అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి