iDreamPost

Vikram First Day Collection: మూడురోజుల్లో విక్రమ్ క‌లెక్ష‌న్స్ 100కోట్లు? ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లు ఎంత?

Vikram First Day Collection: మూడురోజుల్లో విక్రమ్ క‌లెక్ష‌న్స్ 100కోట్లు? ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లు ఎంత?

మేజ‌ర్ పాన్ ఇండియా హిట్ అని మొద‌టి ఆట‌తోనే తేలిపోయింది. హిందీ, తెలుగు రష్ట్రాల్లోనూ మేజర్ మూవీకే ఎక్కువ ఇంపార్టె్స్ ద‌క్కింది. విక్ర‌మ్ సినిమా గురించి పెద్ద‌గా న్యూస్ రాలేదు. రివ్యూవ‌ర్లుకూడా ముందు మేజ‌ర్ మూవీకే ప్ర‌యార్టీ ఇచ్చారు. విక్ర‌మ్ సినిమాకు ఆ త‌ర్వాత రివ్యూలు ఇచ్చారు. ఒక రోజు గ‌డిచేస‌రికి సీన్ కొంత‌వ‌ర‌కు మారింది.

నాలుగేళ్ల తర్వాత ‘విక్రమ్‌’తో వెండితెరపై కమల్‌ హాసన్ హిట్ కొట్టారు. ‘ఖైదీ’,‘మాస్టర్‌’ చిత్రాల దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్ క్రియేట్ చేసిన యూనివ‌ర్స్ లోకి క‌మ‌ల్ హాస‌న్ కూడా వ‌చ్చారు. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌, సూర్యవి ఇతర కీలక పాత్రలు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌’ పేరుతో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ విడుదల చేశారు.

విక్రమ్ రివ్యూ

జూన్‌ 3న రిలీజ్ అయిన ఈ విక్ర‌మ్, పాజిటివ్‌ టాక్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇంట‌ర్వెల్ ముందు వ‌ర‌కు విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్ చెల‌రేగిపోవ‌డానికి వీలుగా, రెండు అడుగులు వెన‌క్కువేసిన క‌మ‌ల్ హాస‌న్, తర్వాత నుంచి సినిమాను పూర్తిగా త‌న కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. యాక్షన్‌ సీన్స్‌లో కమల్‌ హాసన్‌ చూపించిన యాటీట్యూడ్‌, ఆ స్టైల్ కి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ఆయ‌న‌కు 67 ఏళ్ల వయస్సు అంటే న‌మ్మ‌లేం. కమల్‌ని ఫ్యాన్స్‌ తెరపై ఎలా చూడాలని కోరుకున్నారో అలా చూపించాడు డైరెక్ట‌ర్. అందుకే ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ కొట్టింది.

తొలి రోజు వ‌సూళ్లు రూ.45 కోట్లు. ఒక్క తమిళనాడులో రూ.20 కోట్లు వసూళ్లను రాబడితే, కర్ణాటకలో రూ.4.02 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ.3.70, కేరళలో రూ.5.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.11.50 కోట్లను వసూలు చేసింది. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అని ఇండ‌స్ట్రీ టాక్. వ‌చ్చే రెండు రోజుల్లో విక్ర‌మ్ ఈజీగా రూ.100 కోట్ల క్లబ్‌ చేరుతుందన్న‌ది ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి