iDreamPost

తప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన వైద్యులు.. బాలిక మృతి!

తప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన వైద్యులు.. బాలిక మృతి!

తల్లిదండ్రులు జన్మనిస్తే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్ష్మించి వారికి పునర్జన్మనిచ్చేవారు వైద్యులు. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. అలాంటిది కొంతమంది వైద్యులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఓ బాలిక మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మెయిన్‌పురిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలిక మృతి చెందడం తీవ్ర కలకం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తీవ్ర జ్వరం రావడంతో భారతి (17) అనే బాలికను గిగోర్ ఏరియాలో కర్హల్ లోని రాధా స్వామి ఆసుపత్రికి తీసుకువచ్చారు. బుధవారం భారతి కోలుకుందని బంధువులు మనీషా తెలిపారు. అయితే ఓ డాక్టర్ వచ్చి భారతికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అప్పటి నుంచి భారతి ఆరోగ్యం క్షీణించింది. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ సిబ్బంది వేరే హాస్పిటల్ కి వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ అప్పటికే భారతి చనిపోయిందని బంధువు మనీషా తెలిపారు.

బాలిక మృతదేహాన్ని బంధువుల బైక్ పై వదిలి అక్కడ నుంచి చిన్నగా జారుకున్నారు హాస్పిటల్ సిబ్బంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఆరోగ్యంగా ఉన్న భారతి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి చనిపోయిందని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతికి తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే ఈ అనర్ధం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్ సీ గుప్త ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో దీనికి కారణం అయిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి