iDreamPost

వీడియో: మహిళ కాలికి చుట్టుకున్న త్రాచుపాము.. మూడు గంటల పాటు శివ నామస్మరణ! ఆ తర్వాత..

  • Author Soma Sekhar Published - 09:13 PM, Tue - 29 August 23
  • Author Soma Sekhar Published - 09:13 PM, Tue - 29 August 23
వీడియో: మహిళ కాలికి చుట్టుకున్న త్రాచుపాము.. మూడు గంటల పాటు శివ నామస్మరణ! ఆ తర్వాత..

ప్రపంచంలో ఎన్నో నమ్మలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ సంఘటనలను మనం కళ్లారా చూసినా గానీ నమ్మలేం. అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. నిద్రలో ఉన్న ఓ మహిళ కాలుకు చుట్టుకుంది త్రాచుపాము. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు గంటలకు పాటు ఆ పాము అలాగే కాలికి చుట్టుకుని ఉంది. దాంతో తొలుత భయపడ్డ ఆ మహిళ.. తర్వాత మూడు గంటల పాటు శివ నామస్మరణ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

హమీర్ పూర్ జిల్లా దేవిగంజ్ గ్రామానికి చెందిన మిథిలేశ్ కుమారి యాదవ్ రాఖీ పండగ సందర్భంగా.. సొంత ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే రాత్రి నిద్రిస్తున్న ఆ మహిళ కాలికి ఓ త్రాచుపాము చుట్టుకుంది. ఈ సంఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే కంగారు పడకుండా, కదలకుండా శివ నామస్మరణ మెుదలుపెట్టింది. కాగా.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 112కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు.

ఇదంతా జరిగే దాక ఆమె శివ నామస్మరణ చేస్తూనే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు గంటల పాటు కదలకుండా శివ నామస్మరణ చేస్తూనే ఉంది మిథిలేశ్ కుమారి. ఆ ఘటన అనంతరం మిథిలేశ్ కుమారి స్పందించింది. తొలుత తన కాలికి చుట్టుకున్న పామును చూసి భయమేసిందని, అయితే తనకు దేవుడిపై అపారమైన నమ్మకం ఉందని ఆమె తెలిపింది. అందుకే పామును తరిమికొట్టే ప్రయత్నం చేయలేదని, ఆ పరమ శివుడ్ని స్మరిస్తూ ఉన్నానని మిథిలేశ్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇదికూడా చదవండి: సినీ ఫ్యాన్స్ కు పండగే.. సెప్టెంబర్ నెలలో ఏకంగా 12 సినిమాలు విడుదల!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి