iDreamPost

ముఖ్యమంత్రి సోదరి.. చిన్న టీ కొట్టు నడుపుతూ జీవనం!

  • Published Jul 05, 2023 | 5:00 PMUpdated Jul 05, 2023 | 5:00 PM
  • Published Jul 05, 2023 | 5:00 PMUpdated Jul 05, 2023 | 5:00 PM
ముఖ్యమంత్రి సోదరి.. చిన్న టీ కొట్టు నడుపుతూ జీవనం!

మన దగ్గర రాజకీయనాయకులు దగ్గర ఉండే సంపాదన గురించి ఐదో తరగతి పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి.. పదవి చేపడితే చాలు.. తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద వెనకేస్తారు కొందరు నేతలు. వారితో పాటు కుటుంబ సభ్యులందరి పేరు మీద భారీగా ఆస్తులు కూడబెడతారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సీఎం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అవినీతికి ఆమడ దూరంలో ఉంటారు. తన కుటుంబ సభ్యులను కూడా దగ్గరకు రానివ్వరు. కట్‌ చేస్తే.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి సోదరి.. చాలా సాదాసీదా జీవనం సాగిస్తోంది. చిన్న టీ కొట్టు నడుపుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరి ఇంతకు ఎవరా సీఎం అంటే..

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్వతహాగా ఆయన ఆడంబరాలకు దూరంగా సన్యాస జీవితం గడుపుతున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు. అవినీతిని తన దరి దాపులకు కూడా రానివ్వడు. ఇక ఆయన కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఆయన సోదరి చిన్న టీ కొట్టు నడుపుకుంటూ.. జీవనం సాగిస్తుంది. ఆమె పేరు శశి పాయల్. సోదరుడు ముఖ్యమంత్రి అంటే.. ఆమె ఎంత దర్జాగా ఉంటుందో కదా.

కానీ, శశి సింగ్ పాయల్ మాత్రం అందుకు భిన్నంగా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌‌లోని ఫౌరీ గర్వాల్‌లోని మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో చిన్న టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది శశిపాల్‌. ఈ ఆలయానికి వెళ్లాలంటే 2 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిపి.. అక్కడ నుంచి కాలినడకన చేరుకోవాలి. అటువంటి ప్రాంతంలో శశి పాల్‌ ఓ చిన్న టీ దుకాణం నడుపుతుండటం విశేషం.

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి.. శశి పాయల్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. తమ్ముడు ముఖ్యమంత్రి అయినా ఆమెలో ఏమాత్రం గర్వం కనిపించలేదన్నారు దినేశ్‌ చౌదరి. చాలా మంది పర్యాటకులకు.. ఆమె యూపీ సీఎం సోదరి అనే విషయం తెలియదు అన్నారు. అంతేకాక శశిపాల్‌.. సీఎం యోగి గురించి తనతో చాలా విషయాలను పంచుకున్నారని దినేశ్‌ చౌదరి వివరించారు.

‘‘మారుమాల ప్రాంతంలోని ఈ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు.. ఇక్కడ టీ దుకాణం నడుపుతున్న స్త్రీ.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరైన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి అని తెలియదు. శశిపాయల్‌.. యోగి ఆదిత్యనాథ్‌ సోదరి అని.. ఆమె అక్కడ టీ దుకాణం నడుపుతున్నట్టు తెలిసి.. చాలా మంది భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.. ఆమె సింప్లిసిటీకి సెల్యూట్ చేస్తున్నారు.. ఆదిత్యనాథ్ జీ వ్యక్తి ముఖ్యమంత్రిగా లభించడం ఉత్తరప్రదేశ్ ప్రజలు, మనందరం చేసుకున్న అదృష్టం’’ అని ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్‌ చేశారు దినేశ్‌ చౌదరి.

ఇక, యోగి ఆదిత్యనాథ్‌ తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం. వీరిలో శశి పాయల్ అందరికంటే పెద్దది కాగా.. యోగి ఐదో సంతానం. అయితే, యోగి సన్యాసం తీసుకునే వరకూ కుటుంబంతోనే ఉన్నారు. 1994లో సన్యసించిన ఆయన.. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఇక శశి పాయల్‌ విషయానికి వస్తే.. ఆమె కొఠార్ గ్రామానికి చెందిన పురాన్‌సింగ్‌ను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. ఇక తాను ప్రతి ఏటా రక్షాబంధన్ రోజున తన సోదరుడికి రాఖీ పంపిస్తుంటానని శశి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. శశి పాయల్‌ సింప్లిసిటీపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి