iDreamPost

గంటల వ్యవధిలో రైలు ప్రమాదాలు.. పలువురి పరిస్థితి విషమం..!

రైలు ప్రయాణాలంటే చాలా మందికి ఇష్టం. దూర భారాలు వెళ్లాలంటే ఆశ్రయించేది ఈ వాహనాన్నే. హాయిగా, సాఫీగా ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. అయితే ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు.. జనాలను అయోమయంలో పడేశాయి.

రైలు ప్రయాణాలంటే చాలా మందికి ఇష్టం. దూర భారాలు వెళ్లాలంటే ఆశ్రయించేది ఈ వాహనాన్నే. హాయిగా, సాఫీగా ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. అయితే ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు.. జనాలను అయోమయంలో పడేశాయి.

గంటల వ్యవధిలో రైలు ప్రమాదాలు.. పలువురి పరిస్థితి విషమం..!

వరుస రైలు ప్రమాదాలు ప్రజలు ఓ రకమైన భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన మిగిల్చిన ఆనవాళ్లు మర్చిపోక ముందు.. మొన్నటి మొన్న విజయనగరం జిల్లాలో మరో ట్రైన్ యాక్సిడెంట్ సంభవించింది. ఒడిశాలోని బాలాసోర్ ప్రమాదంలో 275 మంది మరణించగా..ఏపీలో జరిగిన ఘటనలో 14 మంది మృతు ఒడికి చేరుకున్నారు. ఇవి చాలవన్నట్లు అక్కడ అడపా దడపా ఇటువంటి సంఘటనలే చోటుచేసుకుంటున్నాయి. పట్టాలు తప్పిన రైలు, తృటిలో తప్పిన ప్రమాదం, బోగీల్లో మంటలు అన్న హెడ్ లైన్స్ చూసి జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మరో రెండు ట్రైన్ యాక్సిడెంట్స్ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

బుధవారం రాత్రి ఢిల్లీ-దర్బంగా హమ్సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి గురైందన్న వార్త బయటకు వచ్చింది. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ బోపత్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్ 1 భోగీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే మరో రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. రైలులో మంటలు రావడాన్ని చూసిన స్టేషన్ మాస్టర్ వెంటనే రైలు ఆపేశారు. ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన తాలూకా వేడి చల్లారే లోపు మరో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారు జామున ఢిల్లీ-సహర్సా వైశాలీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. వేకువ జామున 2.40 గంటల ప్రాంతాలో ఈ ఘటన సంభవించింది.

ఢిల్లీ నుండి బీహార్ లోని సహర్సాకు వెళుతున్న వైశాలీ ఎక్స్‌ప్రెస్.. ఇటావా ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైన్పురి అండర్ బ్రిడ్జ్ కు సమీపానికి రైలు రాగానే ఎస్-6 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లోకో పైలెట్ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. కొంత మంది ప్రాణ భయంతో బయటకు దూకేశారు. ఈ విషయం తెలిసిన రైల్వే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు. మరో రైలులో ప్రయాణీకుల్ని తరలించారు. అయితే ఈ ఘటనలో 19 మంది ప్రయాణీకులు గాయపడగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో రైళల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం కలవరపాటుకు గురి చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి