iDreamPost

పాన్ ఇండియా ప్లాన్ కు రెండు చిక్కులు

పాన్ ఇండియా ప్లాన్ కు రెండు చిక్కులు

నిన్న పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఇప్పటికే విపరీతమైన అంచనాలు మోస్తున్న ఈ మూవీ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. రంగస్థలం గ్యాప్ తో మూడేళ్లు ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేసిన దర్శకుడు సుకుమార్ పనితనం చూసే నిర్మాతలు వెంటనే రెండో భాగానికి రంగం సిద్ధం చేశారు. బాహుబలి, కెజిఎఫ్ ల తర్వాత ఆ స్థాయిలో సీక్వెల్ క్రేజ్ దీనికే వస్తుందని వాళ్ళ నమ్మకం. టీజర్ అయితే అందుకు తగ్గట్టుగానే వచ్చింది.

ఇక విషయానికి వస్తే పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషల్లో విడుదల ప్లాన్ చేసిన పుష్పకు డిసెంబర్ లో రెండు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాను క్రిస్మస్ కే టార్గెట్ చేశారు. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఒకవేళ ఇది నిజమైతే స్క్రీన్ కౌంట్ పరంగా నార్త్ లో అమీర్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ అయినప్పటికీ అదెప్పుడో వచ్చింది కావడంతో ఇప్పటి జెనరేషన్ కు పెద్ద అవగాహన లేదు. సో చాలా మార్పులు చేసి రూపొందించినట్టు బాలీవుడ్ టాక్ ఉంది కనక కంటెంట్ గట్టిగానే ఉండబోతోంది

ఇక్కడితో కథ అయిపోలేదు. డిసెంబర్ లోనే రాఖీ భాయ్ కెజిఎఫ్ 2 కూడా ప్లాన్ చేసుకోబోతోంది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ అంతర్గతంగా ఫిక్స్ అయినట్టు సమాచారం. అదే జరిగితే పుష్పకు ఒకవైపు అమీర్ ఖాన్ మరోవైపు యష్ ఇద్దరూ స్క్రీన్లు పంచేసుకుంటారు. చెప్పడం డిసెంబర్ అన్నారు కానీ పుష్ప ఖచ్చితంగా ఆ డేట్ కు వస్తుందా రాదా ఇప్పుడే చెప్పలేం. ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలోనే షూటింగ్ బ్యాలన్స్ ఉంది, అదంతా పూర్తి చేసి చేతిలో ఉన్న నాలుగు నెలల్లోనే ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుని సెన్సార్ దాకా అన్ని పూర్తి చేసుకోగలరా చూడాలి. కరోనా కాలంలో ఎవరూ దేనికీ కట్టుబడతారన్న గ్యారెంటీ లేదు మరి

Also Read : సలార్ కోసం రాబోతున్న మల్లీశ్వరి ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి