iDreamPost

డాక్టర్ సుధాకర్ పై రెండు కేసులు

డాక్టర్ సుధాకర్ పై రెండు కేసులు

 విశాఖలో జాతీయ రహదారిపై నానా హంగామా చేసిన సస్ఫెండెడ్ డాక్టర్ సుధాకర్ పై రెండు కేసులు నమోదు చేసినట్టు విశాఖ సీపీ ఆర్పీ మీనా తెలిపారు. ఆయన మీడియా కి ఈ విషయం వెల్లడించారు. సుధాకర్ గందరగోళం సృష్టించిన నేపథ్యంలో వారించేందుకు ఎంత ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించి, అందరినీ తిట్టడం , ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అదుపు చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ క్రమంలో అతిగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ని కూడా సస్ఫెండ్ చేసినట్టు సీపీ తెలిపారు.

నేషనల్ హైవే పై ఓ వ్యక్తి మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని డైల్ 100 కి తమకు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి చేరుకున్నారని సీపీ వివరించారు. అప్పటికే అక్కడ డాక్టర్ సుధాకర్ అసభ్యంగా మాట్లాడుతూ అందర్ని తిడుతూ ఉన్నాడని తెలిపారు. తను షర్ట్ తీసి విసిరేసి రోడ్డు మీద వీరాంగం సృష్టించాడన్నారు. పోలీసులు అతన్ని అపే ప్రయత్నం చేసిన ఆగకుండా వీరంగం చేసినట్టు తెలిపారు.

అతను హైవే పై ఎర్పాటు చేసిన స్టాపర్స్ తీసేవేసే క్రమంలో గొడవ జరిగిందని తెలిపారు. దాదాపు 45 నిమిషాల్లో పాటు గందరగోళం సృష్టించాడన్నారు. చివరకు సుధాకర్ ని అరెస్ట్ చేసి కేజీహెచ్ కి తరలించగా మద్యం మత్తులో ఉన్నట్టు వైద్యులు నిర్దారించారన్నారు. ఆ తర్వాత ఆయన మానసిక స్థితి నేపథ్యంలో విశాఖ ఆస్పత్రిలో చేర్చగా మానిసక సమస్యలు నిర్ధారించారని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో సుధాకర్ పై రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

Also Read:రోడ్డున పడ్డ డాక్టర్ సుధాకర్, అవాక్కయిన స్థానికులు

మరోవైపు సుధాకర్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. దళిత డాక్టర్ పై దాడి అంటూ టీడీపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, నిబంధనలు అతిక్రమించి, నానా బీభత్సం సృష్టించిన మానసిక సమస్యతో ఉన్న వ్యక్తిని సమర్థించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కులం కోణంలో ఇలాంటి వారిని సమర్థించడం సరికాదంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు కూడా టీడీపీ తీరుని తప్పుబడుతున్నారు. చంద్రబాబు కారణంగా చివరకు డాక్టర్ సుధాకర్ పరిస్థితి రోడ్డున పడే వరకూ వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. బాబు వాడకానికి డాక్టర్ సుధాకర్ ఓ నిదర్శనం అని అంటున్నారు. వైద్యం చేసే సమయంలో నిజంగా డాక్టర్ సుధాకర్ కి ఏదయినా అవసరం ఉంటే సంబంధిత అధికారికి చెప్పాల్సి ఉన్నప్పటికీ రాజకీయ లక్ష్యాలతో హంగామా చేసి ఆఖరికి ఇలాంటి పరిస్థితిని కొనితెచ్చుకున్నట్టుగా అంతా భావిస్తున్నారు. మొత్తంగా ఈ ఉదంతంలో విశాఖ పోలీసులు మాత్రం సుధాకర పట్ల నమోదు చేసిన కేసులతో డాక్టర్ చిక్కులు పెరుగుతున్నట్టే చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి