iDreamPost

RCBని దారుణంగా అవమానించిన CSK బౌలర్‌ దేశ్‌పాండే!

  • Published May 23, 2024 | 2:46 PMUpdated May 23, 2024 | 2:46 PM

Tushar Deshpande, Eliminator, RCB vs RR, CSK: ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. ఎలిమినేటర్‌లో ఆర్‌ఆర్‌పై ఓటమితో ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. ఈ ఓటమి తర్వాత సీఎస్‌కే ఆటగాడు దేశ్‌పాండే ఆర్సీబీని అవమానించేలా పోస్ట్‌ పెట్టాడు.

Tushar Deshpande, Eliminator, RCB vs RR, CSK: ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. ఎలిమినేటర్‌లో ఆర్‌ఆర్‌పై ఓటమితో ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. ఈ ఓటమి తర్వాత సీఎస్‌కే ఆటగాడు దేశ్‌పాండే ఆర్సీబీని అవమానించేలా పోస్ట్‌ పెట్టాడు.

  • Published May 23, 2024 | 2:46 PMUpdated May 23, 2024 | 2:46 PM
RCBని దారుణంగా అవమానించిన CSK బౌలర్‌ దేశ్‌పాండే!

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఆరంభంలో చెత్త ఆటతో విమర్శలు ఎదుర్కొన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌.. తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా 6 మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఆర్సీబీ చేసిన ఈ పోరాటానికి అంతా ఫిదా అయిపోయారు. కానీ, ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిపోయిన తర్వాత.. ఆర్సీబీపై భారీ స్థాయిలో ట్రోలింగ్‌ జరుగుతోంది. అందులోనూ ముఖ్య​ంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్‌ ఎక్కువగా ఆర్సీబీని ట్రోల్‌ చేస్తున్నారు. వారి అభిమానులకు తాజాగా సీఎస్‌కే ఆటగాడు తుషార్‌ దేశ్‌పాండే కూడా జతకలిశాడు. ఆర్సీబీని దారుణంగా అవమానిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో స్టోరీ పెట్టాడు. ఆ స్టోరీకి సంబంధించిన స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్ల సాధించి ఐదో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే ఇంటి బాట పట్టింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇటు ఆర్సీబీకి అటు చెన్నైకి డూ ఆర్‌ డై మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అలా ఆర్సీబీపై సీఎస్‌కే అభిమానులు కోపం పెంచుకున్నారు. తాజాగా ఎలిమినేటర్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో తమ కోపం మొత్తం ట్రోలింగ్‌ రూపంలో చూపిస్తున్నారు. అలాగే తుషార్‌ దేశ్‌పాండే.. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో బెంగళూరు పేరు కనిపించేలా.. పక్కనే ట్రైన్‌ ఉన్న ఫొటో స్టోరీగా పెట్టాడు.

ఆర్సీబీ కూడా అస్సాం ట్రైన్‌ ఎక్కిసింది అని అర్థం వచ్చేలా దేశ్‌పాండే ఆ పిక్‌ పెట్టాడనే ప్రచారం సోషల్‌ మీడియాలో గట్టిగా జరుగుతోంది. ఈ పోస్ట్‌పై ఆర్సీబీ అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇలాంటి చీప్‌ ట్రోలింగ్‌ చేస్తే ఒక అర్థం ఉంటుంది కానీ, ఒక ప్రొఫెషనల్‌ క్రికెట్‌ అయి ఉండి ఇదేం పని అంటూ మండిపడుతున్నారు. మరోవైపు సీఎస్‌కే అభిమానులు మాత్రం దేశ్‌పాండేను వెనకేసుకొస్తున్నారు. సీఎస్‌కేపై ఆర్సీబీ గెలిచినప్పుడు చిన్నస్వామి స్టేడియం బయట ఆర్సీబీ అభిమానులు చేసిన రచ్చను అప్పుడే మర్చిపోయారా? అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి